Schools: వారానికోసారి బడికి..వారంలో పది, ఇంటరు ఫలితాలను...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Schools: వారానికోసారి బడికి..వారంలో పది, ఇంటరు ఫలితాలను సిద్ధం చేయండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • మంత్రి సురేష్‌ ఆదేశం

Schools: పది, ఇంటరు ఫలితాలను వారం రోజుల్లో వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదేశించారు. శనివారం నిర్వహించిన ఆన్‌లైన్‌ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 2021-22 అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించి, తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టిన ఏపీ అభ్యసన పరివర్తన పథకంతో విద్యలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, గత పదేళ్లలో రాష్ట్రంలో ఇలాంటి ప్రాజెక్టు అమలు చేయలేదని పేర్కొన్నారు.

ఛాయరతన్‌ అధ్యక్షతన కమిటీ

పది, ఇంటరు ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు విశ్రాంత ఐఏఎస్‌ ఛాయరతన్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈమె పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్యురాలిగా ఉన్నారు. ముగ్గురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. పది, ఇంటరు ఫలితాల్లో సీబీఎస్‌ఈ విధానం పాటించడమా? లేదంటే తెలంగాణ, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులను పాటించాలా? అనే దానిపై కమిటీ సిఫార్సు చేయనుంది. 

పంచాయతీరాజ్‌ బడుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ

పంచాయతీరాజ్‌ బడుల పర్యవేక్షణకు కొత్తగా 666 మండల విద్యాధికారులు (ఎంఈవో), 49 డిప్యూటీ డీఈవోలు, 13 డీఈవో పోస్టులను సృష్టించాలని పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు ప్రతాపరెడ్డి ప్రతిపాదించారు. కమిషనరేట్‌లో శనివారం ఉపాధ్యాయసంఘాలతో నిర్వహించిన సమావేశంలో దీనిపై దాదాపుగా అన్ని సంఘాలు అంగీకారం తెలిపాయి. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నట్లు సంచాలకుడు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఉమ్మడి సర్వీసు నిబంధనల అమలు పెండింగ్‌లో ఉన్నందున ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇలా నియమితులయ్యే వారు మండల, జిల్లా పరిషత్తు పాఠశాలలను మాత్రమే పర్యవేక్షించాల్సి ఉంటుంది.

వారానికోసారి బడికి..

జులై ఒకటి నుంచి ఉపాధ్యాయులు వారానికోసారి బడికి వెళ్లాలని అధికారులు సూచించారు. 9, 10 తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలపై వర్క్‌షీట్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు వర్క్‌షీట్లను గ్రామ సచివాలయ విద్యా సహాయ కార్యదర్శులకు అప్పగిస్తే వారు పిల్లలకు అందిస్తారు. విద్యార్థులు పూర్తి చేసిన వాటిని తిరిగి తీసుకొచ్చి, ఉపాధ్యాయులకు అప్పగిస్తారు. ఆగస్టు నుంచి బడులు తెరిచే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించనున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this