Online Teaching: 9, 10 తరగతులకు ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Online Teaching: 9, 10 తరగతులకు దూరదర్శన్ ద్వారా బోధన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • 1 నుంచి ప్రారంభం
  •  ఎసిఇఆర్టీ  డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి
  •  ఉపాధ్యాయ సంఘాలతో చర్చ

Online Teaching: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు జులై 1 నుంచి దూరదర్శన్ ద్వారా విద్యాబోధన చేయాలని ఎస్ఐఆర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో అకడమిక్ కేలండర్పై శనివారం ఉదయం 10.30 గంటలకు గుర్తింపు పొందని సంఘాలతో మధ్యాహ్నం 3:30 గంటలకు విడివిడిగా చర్చలు జరిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో జులై 1 నుంచి 30 వరకు పాఠశాలలు తెరిచే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. కాబట్టి ప్రత్యేకంగా విద్యార్థులకు వర్క్ షీట్లు ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించారు. సప్తగిరి ఛానెల్ ద్వారా ఆన్లైన్లో 9, 10 తరగతుల విద్యార్థులకు బోధన ఉంటుందని చెప్పారు. విద్యార్థులకు వచ్చే అనుమానాలు నివృత్తి చేసేందుకు, వర్క్ షీట్లు సిద్ధం చేసి విద్యార్థులకు అందించాలని తెలిపారు. తల్లిదండ్రుల ద్వారా గానీ, సచివాలయ వాలంటీర్ల ద్వారా గానీ పిల్లలకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. అనుమానాలుంటే ఫోన్లో ఉపాధ్యాయులు నివృత్తి చేయాలనితెలిపారు. వారంలో ఒకరోజు ఉపాధ్యాయులు పాఠశాలకు రావాలని తెలిపారు. దీనికి సంఘాల నాయకులు అంగీకరించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు కూడా వారంలో ఒకరోజు పిల్లల ఎన్రోల్మెంట్, పుస్తకాల పంపిణీపై సలహాలు ఇవ్వాలని కోరగా…ఈ  ప్రతిపాదనలకు అన్ని సంఘాలూ అంగీకారం తెలిపాయి.

ఉమ్మడి సర్వీస్ రూల్స్ పై అనధికార చర్చ 

ప్రభుత్వ, పంచాయతీ ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ వివాదంపై ఉపాధ్యాయ సంఘాలతో డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి అనధికారికంగా చర్చలు జరిపారు. ఎండా, డిప్యూటీ డి డియ పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రతాప్ రెడ్డి సంఘాలు ముందు ఉంచారు. ఈ ప్రతిపాదనలన్నీ సంఘాలు ఒప్పుకుంటే ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు. సుప్రీం కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకునేలా ప్రయత్నం చేయాలని యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ చెప్పారు. ఆ తరువాతే ఇలాంటి అంశాలపై చర్చించాలని సూచించారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం డైరెక్టరు దివాన్ మొయి ద్దీన్, జోసెఫ్ సుధీర్ కుమార్ (ఎస్టియు), డిటిఎఫ్ (నరహరి), గణపతిరావు (ఆష్టా), జివి నారాయణరెడ్డి (ప్రధానోపాధ్యాయుల సంఘం) వి.రెడ్డి శేఖర్ రెడ్డి (వైఎస్ఆర్ఎఫ్), అప్పారావు, (టిఎస్ యుఎస్) తదితరులు పాల్గొన్నారు..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this