Jagananna Vidya Kanuka: ‘విద్యాకానుక’పై సీఎం జగన్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Jagananna Vidya Kanuka: ‘విద్యాకానుక’పై సీఎం జగన్ కీలక ఆదేశాలు.. విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే.. ఖర్చు ఎంతంటే.!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Jagananna Vidya Kanuka: విద్యార్ధులకు ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా పంపిణీ చేసే కిట్లలో నోట్‌ బుక్స్, షూలు, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌‌తో పాటు ఇంగ్లీష్-తెలుగు నిఘంటువులను ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 47.32 లక్షల మందికిపైగా విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక కోసం 2021-22 విద్యా సంవత్సరానికి రూ. 790 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. విద్యారంగంలో ‘నాడు – నేడు’ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత కలిగినదని.. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. అలాగే జగనన్న గోరుముద్ద కోసం 2021–22లో రూ.1625 కోట్లు, మనబడి ‘నాడు –నేడు’ రెండో విడత కోసం దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా విద్యారంగంతో పాటు.. వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్‌ గ్రిడ్, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, వైఎస్సార్ స్టీల్‌ప్లాంట్‌ తదితర కార్యక్రమాలను, అంశాలను సమీక్షించిన సీఎం జగన్.. పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అటు నైపుణ్యాభివృ‌ద్ది కాలేజీలకు సంబంధించిన పనులను వెంటనే మొదలుపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉద్దానం, పులివెందుల, డోన్‌లలో కొనసాగుతున్న వాటర్‌ గ్రిడ్‌ పనులపైనా సమీక్షించిన సీఎం.. ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు.

ఇక రోడ్ల నిర్మాణంపై పలు కీలక వివరాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. వచ్చే ఏడాది మే నెల నాటికి రోడ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. దీనితో రోడ్ల నిర్మాణంపై మరింతగా ధ్యాస పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అమరావతి ప్రాంతానికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టాలని.. పనులు వేగంగా ముందుకు సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. కాగా, రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులతోపాటు షిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలూ వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this