Akhanda in US: అమెరికాలో నందమూరి ఫ్యాన్స్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Akhanda in US: అమెరికాలో నందమూరి ఫ్యాన్స్ రచ్చ.. ఏకంగా 116 కార్లతో ఊహించని రీతిలో..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Akhanda in US: అఖండ ఫీవర్‌ తెలుగు రాష్ట్రాలనే కాదు.. అమెరికాను కూడా షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. అమెరికాలోని పలు రాష్ట్రాలు, నగరాల్లోనూ బాలకృష్ణ నటించిన అఖండ

Akhanda in US: అఖండ ఫీవర్‌ తెలుగు రాష్ట్రాలనే కాదు.. అమెరికాను కూడా షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. అమెరికాలోని పలు రాష్ట్రాలు, నగరాల్లోనూ బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలైంది. అఖండ్ ఫీవర్ షికాగో నగరాన్ని కూడా తాకింది. బాలకృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అక్కడి థియేటర్లు సందడిగా కనిపించాయి.. జై బాలయ్య అంటూ NBK ఫ్యాన్స్‌ ఉర్రూతలూగిపోయారు. షికాగో నగరంలో ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్లకు పెద్ద ఎత్తున బాలయ్య అభిమానులు తరలివచ్చారు. ఇక అఖండ చిత్రం రిలీజ్‌ సందర్భంగా షికాగో నగరంలోని థియేటర్లలో బాలకృష్ణ అభిమానులు కేక్‌ కట్‌ చేశారు. జై బాలయ్యా అంటూ నినాదాలతో సందడి చేశారు.
ఇక డల్లాస్ నగరంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అఖండ్ రిలీజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. డల్లాస్ నగరంలో అభిమానులు భారీ ఎత్తున కార్‌ ర్యాలీ తీసి, థియేటర్ల దగ్గర సంబరాలు చేసుకున్నారు. ఏకంగా 116 కార్లు ఊరేగింపుగా థియేటర్లకు బయలు దేరాయి.. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు అభిమానులు. అక్కడి వీధులు, థియేటర్లు వీరి కేరింతలతో మార్మోగిపోయాయి. డల్లాస్‌ సినిమాక్స్‌ థియేటర్‌లో అభిమానులంతా కేక్‌ కట్‌ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. థియేటర్‌లో తెర వీర బాలయ్య కనిపించగానే కేరింతలు మార్మోగిపోయాయి.. ఆ సందడి చూస్తే అసలు అమెరికాలో ఉన్నామా? ఇండియాలో అనే అనుమానం రాక తప్పదు.
కాగా, డైరెక్టర్‌ బోయపాటి శ్రీనివాస్‌, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సింహ, లెజెండ్‌ సినిమాల తరహాలోనే అఖండ కూడా ఘన విజయం సాధిస్తుందని, రికార్డులు బద్దలు కొడుతుందని ఎన్‌బికే అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.
akhanda in us: అమెరికాలో నందమూరి ఫ్యాన్స్ రచ్చ.. ఏకంగా 116 కార్లతో ఊహించని రీతిలో..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this