US – Sirivennela : ఇలాంటి ఒక...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

US – Sirivennela : ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించలేదు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి తెలుగు ఎన్నారైల ఘన నివాళి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Condolence to Sirivennela Seetharama Sastry: తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే వార్త అమెరికాలోని తెలుగువారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

Condolence to Sirivennela Seetharama Sastry: తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరనే వార్త అమెరికాలోని తెలుగువారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కలం నుంచి జాలివారిన సాహిత్యాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు డల్లాస్ తెలుగువారు. సిరివెన్నెలతో తమకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాహిత్యంతో పాటకు ప్రాణం పోసి.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు కీర్తించేలా చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం ఆగిపోయిదనే వార్త అమెరికాలోని తెలుగువారిని కలచి వేసింది. ఈ నేపథ్యంలోనే.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అమెరికా డల్లాస్‌లో తెలుగు సంఘాలు నివాళులర్పించాయి. తానా, నాటా, టాంటెక్స్‌, నాట్స్‌, ఆటా తదితర తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు తెలుగు ఎన్నారైలు. సిరివెన్నెల సీతారామా శాస్త్రితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మన మధ్య లేకున్నా.. ఆయన అందించిన సాహిత్యం ఎప్పటికీ సజీవంగా మన ముందు కనిపిస్తూ ఉంటుందన్నారు తెలుగు ఎన్నారైలు. అమెరికాలోని పలు నగరాల్లో తెలుగు సంఘాలు నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి హాజరయ్యారు. ఇక్కడి తెలుగువారితో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను తెలుగు ఎన్నారైలు స్మరించుకుని నివాళులర్పించారు.
us – sirivennela : ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించలేదు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి తెలుగు ఎన్నారైల ఘన నివాళి..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this