Home Loan Tips: సొంతిల్లు కొనాలకుంటున్నారా.. తక్కువ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Home Loan Tips: సొంతిల్లు కొనాలకుంటున్నారా.. తక్కువ వడ్డీతో హోమ్ లోన్ అందించే బ్యాంకులు ఇవే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Lowest Interest Home Loan: సొంతంగా ఓ అందమైన ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్న సామెతను సాకారం చేసుకునేందుకు ప్రతిఒక్కరూ పరితపిస్తూ ఉంటారు. అందుకోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. నాలుగు రాళ్లు వెనకేసి.. ఇల్లు కొందామనుకునే లోపు మళ్లీ రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశానికి అంటుతూ ఉంటాయి. ధరలు పైపైకి ఎగబాకుతూ ఉంటాయి. తక్కువ జీతాలు వచ్చే వారికి బ్యాంకులు ఎక్కువ లోన్లు ఇవ్వవు. ఇల్లు కొనుకోవాలనుకున్నట్లు అమాంతం ధరలు పెరిగి ఎక్కువ సొమ్ము వెచ్చించాల్సి వస్తుంది. మరి ఎక్కువ డబ్బు పెట్టేదెలా? కాబట్టి, చాలా మంది కొత్త వాటి కంటే రీ సేల్ ఇళ్లపై దృష్టి పెడుతూ ఉంటారు. అయితే, కొందరు మాత్రం మళ్లీ మళ్లీ కొనేది కాదుగా అంటూ కొంచెం డేర్ చేసి కొత్త ఇళ్లను కొంచెం ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే, అన్ని సందర్బాల్లోనూ కొనుగోలుదారులు ఒకటి గమనించాలి. తక్కువ ధరకు ఎలా ఇల్లు కొనుక్కోవచ్చు అనేది ఇక్కడ మూడు చిట్కాలు ఉన్నాయి. ఏయే బ్యాంకులు ఇందుకు సంబంధించి రుణాలు ఇస్తున్నాయన్న విషయం గమనించాలి.

ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు, కస్టమర్ల ముందు ఉన్న అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే, వారికి ఉత్తమమైన హోమ్ లోన్ ఆఫర్ ఎక్కడ లభిస్తుందనేది.. గృహ రుణాలు చాలా కాలం పాటు ఉంటాయి. కాబట్టి వడ్డీ రేట్లలో స్వల్ప ఉపశమనం దీర్ఘకాలంలో పెద్ద పొదుపు. ఇది బయటకు రావచ్చు. మీకు అత్యంత ఆకర్షణీయమైన రేట్లలో హోమ్ లోన్‌ను అందిస్తున్న బ్యాంకుల గురించి ఇప్పుడు చూద్దాం…

యూనియన్ బ్యాంక్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీతభత్యాలకు 6.40 శాతం ప్రారంభ వడ్డీతో గృహ రుణం ఇస్తోంది. అదే సమయంలో, స్వయం ఉపాధి పొందుతున్న వారికి గృహ రుణాలు ప్రారంభ రేటుతో 6.50 శాతం లభించనుంది. బ్యాంక్ ప్రకారం.. అతి తక్కువ రేటుకు రుణం పొందడానికి, CIBIL స్కోర్ 800 లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉండటం అవసరం. అయితే ఆదాయంలో కొనసాగింపు కూడా అవసరం.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా జీతం పొందే వ్యక్తికి 6.50 శాతం ప్రారంభ రేటుతో గృహ రుణాన్ని అందిస్తోంది. అదే సమయంలో, స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు ప్రారంభ రేటు 6.50 శాతం వద్ద గృహ రుణాలు కూడా అందిస్తోంది. వడ్డీ రేటు రెపో రేటుతో అనుసంధానించడంతో బ్యాంకు ద్వారా రూ. 10 కోట్ల వరకు గృహ రుణం తీసుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా

750 కంటే ఎక్కువ CIBIL స్కోర్ ఉన్నవారికి బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.50 శాతం ప్రారంభ రేటుతో గృహ రుణాన్ని అందిస్తుంది. దీనితో పాటు, బ్యాంకు రుణ మొత్తంలో 0.25 శాతం ప్రాసెసింగ్ ఫీజును కూడా వసూలు చేస్తోంది. ఇది కనిష్టంగా రూ. 1500 లేదంటే గరిష్టంగా రూ. 20 వేలు ఉంటుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్

కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రత్యేక ఆఫర్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో గృహ రుణాలు తీసుకునే వారికి డిసెంబర్ 10 వరకు 6.55 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో రుణాలు అందించనున్నట్లు తెలిపింది. అయితే వారి ఉద్యోగాలు చేస్తున్న వారికి 6.6 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో రుణం అందించడం జరుగుతుంది.

ICICI బ్యాంక్

ICICI బ్యాంక్ 6.70 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో వేతనాలు పొందే వ్యక్తులకు గృహ రుణాలను అందిస్తోంది. బ్యాంక్ ప్రకారం, ఈ రేటుతో గృహ రుణ EMI కనీసం లక్షకు రూ. 645 స్థాయి వరకు రావచ్చు.

home loan tips: సొంతిల్లు కొనాలకుంటున్నారా.. తక్కువ వడ్డీతో హోమ్ లోన్ అందించే బ్యాంకులు ఇవే!

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this