Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? ఈ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? ఈ 4 పదార్థాలను ఆహారంలో చేర్చితే బెస్ట్ రిజల్ట్స్..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Weight Loss Tips: రోటీ, పప్పు, కూరగాయలు మనం ప్రతిరోజు తినే ఆహారంలో భాగంగానే ఉన్నాయి. ఇందులో రోటీలు తినడానికి చాలామంది ఇష్టపడుతుంటాం. అయితే మిల్లెట్, మొక్కజొన్న రోటీ, పంజాబ్ నుంచి బీహార్ వరకు అనేక రకాల రోటీలు తయారు చేస్తారని మీకు తెలుసా? రోటీ తినడంలో ప్రతి ఒక్కరికి ఒక్కో రుచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారంలో రోటీలను తీసుకుంటారు. అందుకే బరువు తగ్గడం విషయానికి వస్తే, ప్రజలు రోటీలను పక్కనపెడుతుంటారు.

రోటీని ఆహారం నుంచి ఒక్క సారి తొలగించడం అంత సులభం కాదనేది కూడా నిజం. అయితే మీరు మీ డిన్నర్ ప్లేట్‌లో చేర్చుకోగలిగే కొన్ని రోటీలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి బరువు తగ్గడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పిండిలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం

జొన్న పిండి:

మీరు బరువు తగ్గాలనుకుంటే, జొన్న పిండిని ఆహారంలో చేర్చండి. ఎందుకంటే జొన్న పిండిలో గ్లూటెన్ రహితం. ఇది ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా లేని వారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఈ పిండి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ ఉత్తమమైనది. ఈ పిండిని కలిపేటప్పుడు కొద్దిగా గోధుమ పిండిని కూడా జోడించవచ్చు.

రాగి పిండి:

రాగి పిండిలో గ్లూటెన్ ఫ్రీ, ఫైబర్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఈ రోటీలను తినడం ద్వారా పొట్ట చాలాసేపటి వరకు నిండుగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మిల్లెట్ పిండి:

మిల్లెట్ పిండిలో గ్లూటెన్ ఫ్రీ, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఇతర పోషకాలు ఈ పిండిలో పుష్కలంగా లభిస్తాయి. ఈ పిండి ప్రత్యేకత ఏమిటంటే, ఇది మిమ్మల్ని అతిగా తినకుండా కూడా నిరోధిస్తుంది. ఎందుకంటే ఈ పిండిని తిన్న తర్వాత, మీరు చాలా కాలం పాటు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ రొట్టె తిన్న తర్వాత, దాహం కూడా ఎక్కువగా వేస్తుంది.

ఓట్స్ పిండి:

ఓట్స్ పిండి కూడా మన పొట్టను చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. ఈ పిండిలో కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది.

weight loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? ఈ 4 పదార్థాలను ఆహారంలో చేర్చితే బెస్ట్ రిజల్ట్స్..!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this