Snow Fall: మంచు దుప్పటి కప్పుకున్న బద్రినాథ్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Snow Fall: మంచు దుప్పటి కప్పుకున్న బద్రినాథ్ ఆలయం.. వెన్నెల సోయగంతో హిమాచల్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Snow Fall: దేశంలో క్రమంగా చలి పెరుగుతోంది. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో మంచు కురుస్తోంది. ముఖ్యంగా హిమాలయ పర్వతాల సమీపంలోని రాష్ట్రాల్లో తీవ్రంగా

Snow Fall: దేశంలో క్రమంగా చలి పెరుగుతోంది. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో మంచు కురుస్తోంది. ముఖ్యంగా హిమాలయ పర్వతాల సమీపంలోని రాష్ట్రాల్లో తీవ్రంగా కురుస్తున్న మంచుతో సరికొత్త అందాలను సంతరించుకుంటున్నాయి.  ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో మంచు కురుస్తుండడంతో కనిషి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఉద‌యం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్‌ధామ్ క్షేత్రాల్లో ఒక‌టైన బ‌ద్రీనాథ్ లో మంచు ఆల‌య ప‌రిస‌రాల్లో విప‌రీతంగా మంచుకురిసింది. మంచు వర్షంలా కురవడంతో.. బద్రీనాథ్​ దేవాలయం మంచు దుప్పటి కప్పుకుంది. ఆల‌యం ఆవ‌ర‌ణ‌లోని మెట్లు, బ‌హిరంగ ప్రదేశం, ఆల‌య గోపురాలపై మంచుగ‌డ్డలు పేరుకుపోయాయి. ఇల్లు రహదారులు పూర్తిగా హిమం లో కలిసిపోయాయి. ఎడతెరపి లేని హిమపాతానికి రహదారి వెంట వాహనాలు ఎక్కడికక్కడే  నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మంచువ‌ర్షం స్థానికుల‌ను చ‌లికి గ‌డ‌గ‌డ‌లాడేలా చేస్తున్నా.. మంచు కురుస్తున్న దృశ్యాలు చూప‌రుల‌కు క‌నువిందు చేస్తున్నాయి. తీవ్రమైన మంచు, చలిగాలుల ప్రభావం నేపథ్యంలో బద్రీనాథ్​ ఆలయాన్ని నవంబర్20న మూసివేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు హిమాచల్​ప్రదేశ్​లో భారీగా మంచు కురుస్తోంది.  వివిధ జిల్లాలో ఎడతెరపి లేకుండా వస్తున్న హిమపాతం కారణంగా పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.  పలు జిల్లాలు మంచుతో కప్పబడి వెండి వెన్నెలలా మెరిసిపోతూ స్వర్గధామంలా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది
snow fall: మంచు దుప్పటి కప్పుకున్న బద్రినాథ్ ఆలయం.. వెన్నెల సోయగంతో హిమాచల్


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this