AndhraPradesh Jobs: ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

AndhraPradesh Jobs: ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AndhraPradesh Jobs: ప్రకాశం జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్‌ విధానంలో…

AndhraPradesh Jobs: ప్రకాశం జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 127 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ల్యాట్‌ టెక్నీషియన్‌ (21), ఫిమేల్‌ నర్సింగ్ ఆర్డర్లీ (68), శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ (38) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా/ బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీ పారా మెడికల్‌ బోర్డ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.
* ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.
* శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదోతరగతి/ తత్సమాన ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ది డిస్ట్రిక్ట్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌, ప్రకాశం జిల్లా, ఒంగోలు, జీజీహెచ్‌, కంపౌండ్‌ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 05-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

andhrapradesh jobs: ప్రకాశం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this