AP News: మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు... నిలబెట్టొచ్చు

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

AP News: మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు… నిలబెట్టొచ్చు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • ఉద్యోగుల కుటుంబసభ్యులతో కలిపితే మేం 60 లక్షల మంది
  • మీ మాయమాటలు నమ్మి మీకు 151 సీట్లు తెచ్చాం
  • చచ్చిపోతున్నామన్నా జీతానికి దిక్కులేని పరిస్థితి
  • ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి వ్యాఖ్యలు

‘మా రెండు జేఏసీల్లో 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులం ఉన్నాం. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో వారి అమ్మా, నాన్న, భార్య/భర్త, బిడ్డలు ఇలా అయిదేసి ఓట్ల చొప్పున లెక్కేసుకున్నా మొత్తం సుమారు 60 లక్షల మంది అవుతాం. మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. నిలబెట్టొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే’ అని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న మీ మాయమాటలు నమ్మి మీకు 151 సీట్లు తెచ్చాం. అందుకే మీరు మా వంక చూడట్లేదు’ అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ధ్వజమెత్తారు. ‘ఒకటో తేదీన జీతాలు పొందటమనేది ఉద్యోగుల హక్కు. అలాంటిది చచ్చిపోతున్నామన్న సరే ఇప్పుడు జీతానికి దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఒకటో తేదీన జీతం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. విజయవాడలో ఇటీవల జరిగిన ఏపీ ఎన్జీవోల సంఘం అంతర్గత సమావేశంలో ఆయన ప్రసంగించారు. దానికి సంబంధించిన వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అందులోని ప్రధానాంశాలివీ.

ఆ విజయాలు ఆరిపోయే ముందు వెలుగులాంటివి:  ‘చచ్చిపోయే (ఆరిపోయే) ముందు దీపం బాగా వెలుగుతుంది. జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో సాధించిన పిచ్చి పిచ్చి విజయాలు అలాంటివే’ అని బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రతిపక్షంలో ఉంటాను తప్ప 5 డీఏలు ఇవ్వలేనని చెప్పిన చంద్రబాబుకు.. ఉద్యోగుల గురించి బాగా తెలుసని వివరించారు.

పాలు, కూరగాయలు అమ్మేవారికీ లోకువైపోయాం:  ‘ప్రభుత్వోద్యోగులంటే ఓ గౌరవం ఉండేది. ఇప్పుడు పాలు, కూరగాయలు అమ్మేవారికి కూడా లోకువైపోయాం. ప్రభుత్వోద్యోగులు దీనావస్థలోకి వెళ్లిపోయారు. సుబ్బారావుకు జీతం వచ్చింది. ఎల్లయ్యకు రాలేదు అనే పరిస్థితిలోకి నెట్టేశారు’ అని విమర్శించారు. ఈ ఏడాది జులై 1న తాను ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని.. ఆ నెల 29న తిరుపతిలో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని చెప్పానని గుర్తుచేసుకున్నారు. ‘గతంలో ఎవరికైనా ఒకటో తేదీకి జీతం రాకపోతే ఆ విషయం గురించి కలెక్టర్‌కు టెలిగ్రామ్‌ ఇస్తే సంబంధిత డ్రాయింగ్‌ అధికారిని గందరగోళం చేసేసేవారు. ఇప్పుడు ఉద్యోగులు చచ్చిపోతున్నా జీతానికి దిక్కులేని పరిస్థితి అయిపోయింది’ ఆని ఆవేదన వ్యక్తం చేశారు.

మీ మోచేతి నీళ్లు తాగం..

‘మీ మోచేతి నీళ్లు తాగే పరిస్థితి కాదు. ఉద్యమం ద్వారానే మా హక్కులు సాధించుకుంటాం తప్ప.. మీ దయాదాక్షిణ్యాలపై కాదు’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించే రోజు వచ్చిందని బండి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ‘రైతుల ఉద్యమానికి దిగి వచ్చి ప్రధానమంత్రి సైతం తప్పు అయిపోయింది.. క్షమించమన్నారు. ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయి. ఈ రోజు నువ్వు చేసే ఉద్యమం నీ కోసం. నీ బిడ్డల కోసం. ఉద్యమం అంటే ఎలా ఉండాలో భావితరాలకు చెప్పటం కోసం’ అంటూ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

ap news: మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు... నిలబెట్టొచ్చు

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this