Fevers: విద్యార్థుల తల్లిదండ్రుల్లో కలవరం... విద్యార్థులు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Fevers: విద్యార్థుల తల్లిదండ్రుల్లో కలవరం… విద్యార్థులు జ్వరాలతో ఆసుపత్రిలో చేరిక

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • ఒకే రోజు 14మంది విద్యార్థులు జ్వరాలతో ఆసుపత్రిలో చేరిక

ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకరి వెనుక ఒకరు ఏకంగా 14మంది విద్యార్థులు జలుబు, జ్వర లక్షణాలతో జిల్లా ఆసుపత్రిలో చేరిన సంఘటన విద్యార్థులు వారి తల్లిదండ్రులతోపాటు అందరినీ కలవరపరుస్తోంది. మచిలీపట్నంలోని మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల్లో ఒకే రోజు ఎక్కువమందికి జ్వర లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది. విద్యాలయ అధికారులు తక్షణ చర్యలు చేపట్టడంతోపాటు వైద్యాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఓ పక్క కొవిడ్‌ కేసులు నమోదవుతున్న వేళ జ్వరాల కేసులు కూడా జిల్లాలో అధికసంఖ్యలో నమోదవుతున్నాయి. ఇటీవల పెడన మండలం బల్లిపర్రులో విద్యార్థులు కొవిడ్‌ బారిన పడిన సంఘటన తరువాత పదుల సంఖ్యలో విద్యార్థులు జ్వరాలబారిన పడిన సంఘటన ఇదే. . విద్యాలయంలో 92మంది పిల్లలు ఉండగా ఎక్కువమంది విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, రెడ్డిగూడెం తదితర మండలాలకు చెందిన వారే ఉంటారు. విషయం తెలుసుకున్న పలువురు తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. మిగిలిన వారికి సమాచారం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. అదేమని అడిగితే పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లే హడావుడిలో ఉన్నామని చెబుతున్నారని ఆరోపించారు.

వివరాల సేకరణలో..:  శనివారం ఉదయం కొందరు విద్యార్థులకు అకస్మాత్తుగా విపరీతమైన జ్వరం వచ్చింది. వారిని ఆసుపత్రికి తరలించే లోపే మరింతమంది  జ్వరాలబారిన పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన వారిలో పలువురు కోలుకోగా మిగిలినవారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వయసుల వారీగా  వివిధ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిని ‘న్యూస్‌టుడే’ ఆదివారం పరిశీలించగా కొంతమంది విద్యార్థులకు కుటుంబసభ్యులు సేవలు అందిస్తుండగా, తల్లిదండ్రులు రాని పిల్లలను పాఠశాల సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బడిలో కూడా ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ప్రస్తుతానికి వైద్యులు వైరల్‌ జ్వరాలుగా భావించి చికిత్స అందిస్తున్నారు. వారందరి నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు.  కొందరు విద్యార్థులు కోలుకోవడంతో  ఊపిరి పీల్చుకుంటున్నా…ఎందుకు అలా జరిగిందనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పాఠశాలలో జరిగిన సంఘటన విద్యాలయాల్లో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.

నమూనాలు ల్యాబ్‌కు పంపించాం

విద్యార్థులు వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నారు. ఒకరినుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. 48 గంటల పర్యవేక్షణ పూర్తయిన తరువాత పరిస్థితులను బట్టి డిశ్ఛార్జిచేస్తాం.  టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ, కొవిడ్‌ పరీక్షలు కూడా చేశాం. సోమవారానికి అన్ని నివేదికలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

– డా. అల్లాడ శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో, జిల్లా ఆసుపత్రి

fevers:  విద్యార్థుల తల్లిదండ్రుల్లో కలవరం... విద్యార్థులు జ్వరాలతో ఆసుపత్రిలో చేరిక

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this