AP Capital: విశాఖ రాజధానికి ముహూర్తం ఇదే?.....

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP Capital: విశాఖ రాజధానికి ముహూర్తం ఇదే?.. లీక్ చేసిన ఏపీ మంత్రి, జగన్‌ సన్నిహిత నేత..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP Capital update: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై సీఎం జగన్ పూర్తి క్లారిటీతో ఉన్నారా..? సాంకేతిక అంశాలతో కూడిన కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్లాన్ రెడీ చేశారా..? ఉగాది నాటికి స్పష్టమైన ప్రకటన చేయనున్నారా..?

AP New Capital:  ఆంధ్ర్రప్రదేశ్ (Andhra Pradesh)కు మూడు రాజధానుల విషయంపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదా..? ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో  సీఎం జగన్  చెప్పినట్టు.. జస్ట్ బ్రేక్ మాత్రమేనా.. అంటే మూడు రాజధానుల బిల్లును వెక్కు తీసుకున్నామని. మళ్లీ త్వరలో మరో బిల్లు తెస్తామని అసెంబ్లీ వేదికగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) స్పష్టత ఇచ్చారు. మూడు రాజధానుల విషయంలో మరింత కొత్తగా.. ఎలాంటి ఇబ్బందులు అంటే.. న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకు రావాలనే.. సీఎం జగన్ మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నారా..? అంటే అవునానే వైసీపీ (ycp) వర్గాల నుంచి సమాధానం వస్తోంది. తాజాగా   విశాఖ (Visakha)నే రాజధానిగా చేస్తుందని.. ఆ ప్రక్రియకు టైం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.  ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. రానున్న శ్రీరామనవమి (Sriramanavami) రోజునే రాజధాని విషయంలో ప్రకటన కూడా చేస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏపీకి చెందిన ఒక మంత్రి  ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు.
ఇన్నాళ్లూ వేధించిన ప్రశ్నకి ఇక జగన్ మోహన్ రెడ్డి సర్కారు సమాధానం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మొన్న గురువారం ఏపీ మంత్రి ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. రానున్న ఉగాది తర్వాత.. ఒక క్లియర్ ప్రకటన చేస్తారని.. ఈ విషయంలో సీఎం స్పష్టమైన వైఖరితో ఉన్నారని ఆ వ్యాఖ్యల సారాంశం. ఉగాదికి ఎలాగూ ఇంకేదైనా ప్రకటన చేసే అవకాశం ఉండవచ్చు.  అందులోనూ శ్రీరామనవమి రామ పట్టాభిషేకం.. అయోధ్య మహా రాజ్యానికి రాముడు వచ్చినట్టుగా పురాణం. ఇలాంటి రోజున రాజధానిని ప్రకటిస్తే బాగుంటుందని వైసీపీ అధినాయత్వం ఆలోచించిందని తెలుస్తోంది.
మూడు రాజధానుల బిల్లు రద్దు ప్రక్రియ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కాస్తంత వ్యతిరేకత వచ్చిందన్నది వాస్తవం. ప్రధాన ప్రతిపక్షం టీడీపికి ఇది ఒక అస్త్రంగా మారింది. అయితే అమరావతే రాజధాని కావాలంటూ అక్కడి రైతులు పగలనకా.. రాత్రనకా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దీనికి తోడు రైతులకు అండగా ఉంటామని టీడీపీ, బిజెపి జనసేన పార్టీలు కూడా ఇప్పటికే మాటిచ్చాయి కూడా. ఇదే ఇప్పుడు చిక్కుగా ఉంది.
అమరావతి రాజధానిగా ప్రకటించి వైసీపీ సర్కారు వెనక్కి తగ్గుతుందా…? లేకపోతే.. విశాఖ రాజధాని అంటూ తన స్టాండ్ పై నిలబడుతుందా అనేది తేలాల్సి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచీ ఇక్కడ టీడీపీ, స్థానిక బిజెపి జనసేన వరకూ అన్ని పార్టీలు ఏపీలో వైసీపీ సర్కారు మెడలు వంచడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరి ఈ తరుణంలో వైసీపీ అటెళ్తుందా..? ఇటొస్తుందా అన్నది తేలాలి. 
నిజానికి విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయాలన్నది వైసీపీలో ఉన్న క్లారిటీ. అక్కడ రాజధాని తెస్తేనే.. వైసీపీ తమ పంతం నెగ్గించుకున్నట్టు ఉంటుందని అందుకే విశాఖ పైనే ఫోకస్ ఉంటుందని చాలావరకూ మాట్లాడుకుంటున్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు సాంకేతిక అంశాల పరిశీలిన అనే మాట తప్పితే.. మిగతా అంశాలన్నిటినీ వైసీపీ ముందుకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు విశాఖలోనే రాజధాని వస్తుందనీ.. అదీ శ్రీరామనవమికి ఆ ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఇక ఏం జరుగుతుందో..?
ap capital: విశాఖ రాజధానికి ముహూర్తం ఇదే?.. లీక్ చేసిన ఏపీ మంత్రి, జగన్‌ సన్నిహిత నేత..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this