Winter Tips: చన్నీటి స్నానం లేదా వేడి...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Winter Tips: చన్నీటి స్నానం లేదా వేడి నీటి స్నానం.. శీతాకాలంలో ఏది మంచిది? ఆయుర్వేదంలో ఏం చెప్పారు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అన్ని కాలాలు వేరు.. శీతా కాలం వేరు. ఎండా కాలం, వర్షా కాలంలో ఎలా ఉన్నా కానీ.. శీతా కాలంలో మాత్రం చర్మం పరంగా, ఆరోగ్యం పరంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సాధారణంగా కొంత మంది చన్నీటితో స్నానం చేస్తారు. మరి కొంత మంది వేడి నీటితో చేస్తారు. స్నానం చేస్తే మంచి రిలాక్సేషన్ దొరకుతుంది. చిరాకు పోయి.. మనసుకి హాయిగా ఉంటుంది. అయితే చన్నీటి స్నానం మంచిదా? వేడి నీటి స్నానం చేయడం మంచిదా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. మరి ఏ స్నానం వల్ల లాభాలు..

winter tips: చన్నీటి స్నానం లేదా వేడి నీటి స్నానం.. శీతాకాలంలో ఏది మంచిది? ఆయుర్వేదంలో ఏం చెప్పారు..!

అన్ని కాలాలు వేరు.. శీతా కాలం వేరు. ఎండా కాలం, వర్షా కాలంలో ఎలా ఉన్నా కానీ.. శీతా కాలంలో మాత్రం చర్మం పరంగా, ఆరోగ్యం పరంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సాధారణంగా కొంత మంది చన్నీటితో స్నానం చేస్తారు. మరి కొంత మంది వేడి నీటితో చేస్తారు. స్నానం చేస్తే మంచి రిలాక్సేషన్ దొరకుతుంది. చిరాకు పోయి.. మనసుకి హాయిగా ఉంటుంది. అయితే చన్నీటి స్నానం మంచిదా? వేడి నీటి స్నానం చేయడం మంచిదా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. మరి ఏ స్నానం వల్ల లాభాలు ఉన్నాయి? లేక నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

శీతా కాలంలో చన్నీటి స్నానం చేస్తే..: శీతా కాలంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల బాడీలో వాతవ అనేది పెరుగుతుంది. దీని వల్ల నొప్పులు, కండరాల నొప్పులు, చర్మం పొడి బారడం, బలహీనమైన జీవక్రియ వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతే కాకుండా శరీరం నొప్పులు తీరవు. కానీ ఒకవేళ క్రమం తప్పకుండా చన్నీటితో స్నానం చేసే వారైతే మాత్రం.. శీతా కాలంలో కూడా చన్నీటి స్నానం చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో ఎలాంటి భంగం కలిగించదు. అంతే కాకుండా చన్నీటి స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతంది. తెల్ల రక్తకణాలు అధిక శాతం, జీవ క్రియ రేటు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

శీతా కాలంలో వేడి నీటి స్నానం చేస్తే..: వింటర్ సీజన్ లో వేడి నీటితో స్నానం శరీర వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే కండరాల నొప్పులు, ఒత్తిడి తగ్గుతుంది. మనసుకు, శరీరానికి ప్రశాంతంగా ఉంటుంది. అంతే కాకుండా వేడి నీళ్లు చేసేటప్పుడు వచ్చే పొగను పీల్చడం ద్వారా జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చలి తీవ్రతను కూడా తగ్గిస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం ఏ నీటితో చేస్తే మంచిది: ఆయుర్వేదం ప్రకారం చన్నీటి స్నానం చేయడం వల్ల వాతాన్ని పెంచడమే కాకుండా చలి కూడా పెరుగుతుంది. కాబట్టి శరీరం వేడిని కాపాడుకోవడానికి చాలా కష్ట పడాలి. చలి కాలంలో బాహ్య ప్రపంచం చల్లగా ఉంటుంది. శరీరం అంతర్గత వాతావరణాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మీరు శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. వేడి నీటి స్నానంతో చలి కారణంగా వణుకు తగ్గడమే కాకుండా ఒత్తిడి, కండరాల నొప్పులు, సీజనల్ గా వచ్చే వ్యాధులనూ దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this