Best Phones Under 20K: అత్యధికంగా అమ్ముడవుతున్న...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Best Phones Under 20K: అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే.. చవకైన ధర, సూపర్ పనితీరు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా ఫోన్ ధరను బట్టి అందులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంటాయి. అయితే మరీ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అనువైన బడ్జెట్లోనే బెస్ట్ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. రూ. 20,000 పెట్టగలిగితే హై ఎండ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో రూ. 20,000 లోపు ధరలో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చూద్దాం.

best phones under 20k: అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే.. చవకైన ధర, సూపర్ పనితీరు..
ప్రపంచం స్మార్ట్ అడుగులు వేస్తోంది. ప్రతీది డిజిటల్ మయం అయిపోతోంది. అందుకు స్మార్ట్ ఫోన్ అనివార్యం అవుతోంది. ప్రతి ఒక్కరి చేతిలో ఓ స్మార్ట్ ఉండాల్సిందే. లేకుంటే ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సాధారణంగానే టెక్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా ఫోన్ ధరను బట్టి అందులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంటాయి. అయితే మరీ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అనువైన బడ్జెట్లోనే బెస్ట్ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. రూ. 20,000 పెట్టగలిగితే హై ఎండ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో రూ. 20,000 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చూద్దాం..
వన్ ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్ 5జీ.. ఇది క్లాసీ ఎడ్జ్ లుక్ లో ఉంటుంది. 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. వెనుకవైపు 108ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీ కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13.1 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ పై పనిచేస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ. 19,999గా ఉంది.

రియల్ మీ నార్జో 60 5జీ.. గేమింగ్ కావాలనుకునే వారికి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎంపిక ఇది. 6.43 అంగుళాల 90హెర్జ్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6020 5జీ చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్ తో పాటు 128జీబీ, 256జీబీ స్లోరేజ్ ఆప్షన్లతో ఉంటుంది. వెనుకవైపు 64ఎంపీ, ముందు వైపు 16ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. రియల్ మీ యూఐ4, ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ. 17,999గా ఉంది.

వన్ ప్లస్ నోర్డ్ సీఈ2 లైట్ 5జీ.. వన్ ప్లస్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇది. దీనిలో 6.59 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. 64ఎంపీ వెనుకవైపు కెమెరా, ముందు వైపు 16ఎంపీ కెమెరాతో వస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12, ఆక్సిజన్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 17,999గా ఉంది.

రియల్ మీ నార్జో 60ఎక్స్ 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ 6.72 అంగుళాల డైనమిక్ అల్ట్రా స్మూత్ డిస్ ప్లేతో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 5జీ చిప్ సెట్ తో వస్తుంది. 4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. వెనుక వైపు 50ఎంపీ, 2ఎంపీ, 5ఎంపీ కెమెరాలు ఉంటాయి. ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ స్మామర్థ్యంతో బ్యాటరీ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13, రియల్ మీ యూఐ 4.0 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 14,499గా ఉంది.

టెక్నో పోవా 5 ప్రో 5జీ.. గత సెప్టెంబర్లో విడుదలైన ఈ హ్యాండ్ సెట్ మంచి ఫీడ్ బ్యాక్ సంపాదించుకుంది. దీనిలో 6.78 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. డైమెన్సిటీ 6080 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ, 256జీబీ స్టోరేజ్ సాయంతో పనిచేస్తుంది. 50ఎంపీ వెనుకవైపు కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ.15,999గా ఉంది.

రెడ్ మీ నోట్ 12 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. ముందు వైపు 13ఎంపీ కెమెరాతో వస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్1 ప్రాసెసర్ ఉంటుంది. ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. దీని ధర రూ. 11,999గా ఉంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this