Bigg Boss 5 Telugu Unseen: అతనితో...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Bigg Boss 5 Telugu Unseen: అతనితో కనెక్షన్ ఇంత డేంజరా.. కల్లోకి వచ్చేస్తున్నాడు.. అన్ సీన్ వీడియోలో సిరి ఎమోషనల్.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

యాంకర్ రవి ఎలిమినేషన్ తరువాత బిగ్ బాస్ లెక్కలు మారిపోయాయి. ముఖ్యంగా సిరి-షణ్ముఖ్‌ల గేమ్ స్ట్రాటజీ విమర్శలకు తావిస్తోంది. రవి ఎలిమినేషన్‌కి కారణమైన ఈ ఇద్దరూ రవీ.. రవీ అంటూ సింపథీ గేమ్ ప్లే చేస్తున్నారు.

ఏమాటకామాట చెప్పుకోవాలంటే సిరి.. షణ్ముఖ్ విషయంలో విమర్శల పాలౌతున్నప్పటికీ.. టాస్క్‌ల పరంగా అందరికంటే తోపు అనే చెప్పాలి. మగాళ్లతో పోటీపడుతూ టాస్క్‌లలో ఇరగదీస్తుంది. సీజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్‌ వరకూ ఏ టాస్క్ చూసుకున్నా సిరి పెర్ఫామెన్స్ పరంగా పీక్స్. ఆ షన్నూతో హగ్‌లు రొమాన్స్.. వాళ్ల మధ్య రిలేషన్ మినహాయిస్తే.. సిరి గేమ్ పరంగా టాప్‌ 5లో అర్హత సాధించడమే కాదు.. టైటిల్ విన్నర్ అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
ఇదిలా ఉంటే.. షణ్ముఖ్ విషయంలో ప్రతిసారి అవమానపడుతున్న సిరి.. ఒంటరిగా ఫీల్ అవుతూ తన బాధను కాజల్‌తో షేర్ చేసుకుంది. ఈ పెర్ఫామెన్స్ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో చూపించలేదు కానీ.. అన్ సీన్ వీడియోలో ఈ కాళాఖండం ఉంది.
విచిత్రం ఏంటంటే.. మొన్నటి ఐస్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయిన రవిపై విపరీతమైన ప్రేమను చూపిస్తున్నారు షణ్ముఖ్, రవిలు. ఆ టాస్క్‌లో రవీ.. ఐ మిస్ యూ.. నేను గివ్ అప్ ఇవ్వను.. నీకోసం ఆడుతున్నాం.. అంటూ అటు షన్నూ.. ఇటు సిరి ఓరేంజ్ పెర్ఫామెన్స్‌తో ఇరగదీశారు. అయితే యంకర్ రవి హౌస్‌లో ఉన్నప్పుడు అటు సిరి కానీ.. ఇటు షణ్ముఖ్ కానీ.. అతనితో పెద్దగా క్లోజ్‌గా ఉన్నది లేదు. ఒకవేళ రవి వీళ్లతో క్లోజ్‌గా ఉన్నా.. స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడని.. ఇన్ఫులెన్స్ చేస్తున్నాడని.. ఒకర్ని తొక్కి పైకి ఎదగాలనుకునే క్యారెక్టర్ అని.. రవి గురించి సిరి-షణ్ముఖ్‌లు గుసగుసలాడేవారు.
చివరికి రవి ఎలిమినేట్ అయ్యాడంటే.. సిరి-షణ్ముఖ్‌ల వల్లే.. ఈ ఇద్దరూ ఏకాభిప్రాయంతో రవిని నామినేట్ చేసి ఎలిమినేట్ అయ్యేట్టు చేశారు. అయితే ఎప్పుడైతే రవి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లాడో అప్పటి నుంచి రవిపై ప్రేమ కురిపిస్తూ.. సింపథీ గేమ్ మొదలుపెట్టారు.
ఇక మంగళవారం నాటి 94 ఎపిసోడ్ అన్ సీన్ వీడియోలో అయితే రవి ఏకంగా సిరి కలలోకి వచ్చేశాడట.. ‘తనకి కల వచ్చిందని.. ఆ కలలో రవి హౌస్‌లో ఉన్నట్టు కనిపించిందని.. రవి సడెన్‌గా మాయం అయ్యాడు.. నేను గట్టిగా అరిచాను.. ఇంతలో షన్నూ వచ్చాడు.. నిద్రలో నుంచి లేచిపోయా.. రవిని చాలా మిస్ అవుతున్నా.. చాలా అంటే చాలా.. హౌస్ నుంచి వెళ్లిపోయిన తరువాత చాలా మిస్ అవుతున్నా’ అని కాజల్‌తో కల గురించి చెప్పి ఏడ్చేసింది సిరి.
ఇక కెమెరాలను ఫోకస్ చేస్తూ సిరి తనలో తాను మాట్లాడుకుంది.. ‘షాకింగ్‌గా ఉంది నాకు.. ఏదో అవుతుంది లోపల.. గుండె కొట్టేసుకుంటుంది.. ఒంటరి అయ్యాననే భావన కలుగుతుంది.. ఏమైందో తెలియడం లేదు. నేనేంటో నాకే తెలియడం లేదు.. అమ్మో మనుషులతో కనెక్షన్ ఇంత డేంజరా.. గుండెల్ని పట్టేస్తుంది.. రవి నిన్ను చాలా మిస్ అవుతున్నా.. మిస్ యు.. నా కలలోకి కూడా వచ్చావు’అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సిరి.
bigg boss 5 telugu unseen: అతనితో కనెక్షన్ ఇంత డేంజరా.. కల్లోకి వచ్చేస్తున్నాడు.. అన్ సీన్ వీడియోలో సిరి ఎమోషనల్.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this