Pushpa: ఉర్రుతలూగిస్తున్న పుష్ప మాస్ మసాలా సాంగ్.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Pushpa: ఉర్రుతలూగిస్తున్న పుష్ప మాస్ మసాలా సాంగ్.. అదరగొట్టిన సామ్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకోసం బన్నీ ఆర్మీ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు. గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు  సినిమా పై ఆసక్తి పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తార స్థాయికి చేర్చింది. తాజాగా ఈ సినిమానుంచి మాస్ మసాలా సాంగ్ ను విడుదల చేశారు .

ఈ స్పెషల్ సాంగ్ లో సమంత నటించింది. యువతను ఉర్రుతలూగించేలా ఉంది సాంగ్. ఈ సినిమా కు దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా.. ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ పాట సినిమాకు ఓ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా డిసెంబర్ 17న గ్రాండ్ గా విడుదలకానుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా 5 భాషల్లో విడుదుల కానుంది. ఇక డిసెంబర్ 12 ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సినిమా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఇక మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే సునీల్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this