Saturday, June 14, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Tirupati: శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం.....

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

Tirupati: శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం.. రూ. 3 కోట్లు విలువజేసే వరద-కఠి హస్తాల బహుకరణ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Tirupati: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి అరుదైన భూరి విరాళం అందింది. తిరుమల శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం అందించారు.. దాదాపు మూడు కోట్ల విలువ చేసే వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద-కఠి హస్తాలను విరాళంగా ఇచ్చారు. వీటి బరువు సుమారు 5.3 కిలోల వరకూ ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే..

శ్రీవారిని దర్శించుకున్న ఓ దాత స్వామివారికి బహుమానం రూపంలో వీటిని ఇచ్చారు. వజ్రాలు, కెంపులు పొదిగిన బంగారు వరద కఠి, హస్తాలను స్వామివారికి విరాళంగా అందజేశారు.. ఇవాళ ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఓ భక్తులు వీటిని ఆలయానికి ప్రత్యేకంగా తీసుకువచ్చారు.  ఈ బంగారు కఠి, హస్తాలు దాదాపు 5.3 కిలోల బరువుంటాయి.. వీటి విలువ సుమారు మూడు కోట్లు దాకా ఉంటుంది.. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఆ భక్తులు ఈ ఆభరణాలను అందించారు ఆ భక్తుడు. అనంతరం ఆలయ అధికారులు దాతను ప్రత్యేకంగా సత్కరించారు..

ఈ ఆభరణాలను టీటీడీ అధికారులు, అర్చకులు శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.. ఈ వజ్రాలు, పెంపులు పొదిగిన బంగారు వరద-కఠి హస్తాల విలువ 3 కోట్ల రూపాయలు ఉంటుందని టీటీడీ తెలిపింది. కాగా ఈ దాత వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.. ఈ భక్తుడు చెన్నైకి చెందిన వ్యాపారి అని తెలుస్తోంది.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this