Thursday, November 20, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
ViralViral news | ఆ గ్రామంలో స్త్రీలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

Viral news | ఆ గ్రామంలో స్త్రీలు దుస్తులు ధరించరు.. అది విదేశీ గ్రామం కాదు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Viral news | భారతదేశం లక్షలాది గ్రామాలతో సుసంపన్నంగా ఉన్న దేశం. మన దేశంలో ఒక్కో గ్రామానికి ఒక్కో ఆచార వ్యవహారం ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఈ ఆచారాల్లో కొన్ని చాలా వింతగా అనిపిస్తాయి. ప్రస్తుతం మన దేశంలోని ఓ గ్రామంలో ఇప్పటికీ పాటిస్తున్న ఆ వింత ఆచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

viral news
november 20, 2025, 5:06 am - duniya360

హిమాచల్‌ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలో పిని అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ వింత ఆచారం అమలులో ఉన్నది. ఆ గ్రామానికి చెందిన మహిళలు దుస్తులు ధరించకుండా నగ్నంగా వీధుల్లో తిరగడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఏడాది పొడవునా ఈ ఆచారం ఉండదు. ఏడాదికి ఒక ఐదు రోజులు ఆ గ్రామానికి చెందిన మహిళలు ఈ ఆచారాన్ని పాటిస్తారు.

శతాబ్దాల కాలం నాటి ఈ ఆచారాన్ని అక్కడి మహిళలు ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఆచారం కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు. ఈ సందర్భంగా పురుషులు కూడా కొన్ని నియమాలు పాటించాలి. మహిళలు ఈ వ్రతంలో ఉన్నప్పుడు వాళ్లతో వారి భర్తలు మాట్లాడకూడదు. మద్యం, మాంసం తినకూడదు. అలా చేస్తే వ్రత భంగం కలిగి కీడు జరుగుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం.

కాగా ఏడాదిలో ఓ ఐదు రోజులు మహిళలు దుస్తులు విప్పుకుని ఉండకపోతే ఆపద వస్తుందని వారి భయం. ఆపదకు రాక్షసులే కారణమని వారు నమ్ముతున్నారు. శతాబ్దాల క్రితం వారి గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించారట. ఆ సమయంలో అసురులు అందమైన దుస్తులు ధరించిన వివాహిత స్త్రీలను తీసుకువెళ్లారట.

మొత్తం ఐదు రోజులపాటు రాక్షసులు ఈ దారుణానికి పాల్పడ్డారట. దాంతో దేవుడు లాహువా ఘోంట్ ఆ గ్రామానికి వచ్చి ఆ రాక్షసులను నాశనం చేశాడట. అందుకే ఏడాదిలో ఆ ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరిస్తే కీడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే ఏటా ఆ ఐదు రోజులపాటు తమ దుస్తులను వదిలేస్తారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this