Anganwadi Supervisors Appointments : అంగన్వాడి సూపర్వైజర్ల నియామకానికి ఉత్తర్వులు విడుదల
Anganwadi Supervisors Appointments
న్యూస్ టోన్, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 560 అంగన్వాడి సూపర్వైజర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో 576 పోస్టులను సాంక్షన్ చేస్తూ విడుదల చేసిన ఉత్తర్వులకు అనుబంధంగా ఈ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. గతంలో 976 సూపర్వైజర్ పోస్టులకు గాను 416 పోస్టులను ప్రభుత్వం ఇదివరకే భర్తీ చేసింది. ఇప్పుడు మిగిలిన 560 పోస్టులను అర్హత కలిగిన అంగన్వాడి వర్కర్ల చే భర్తీ చేయాలని ఉత్తర్వులలో పేర్కొంది.
ఈ నియామక ప్రక్రియ ప్రభుత్వం నియమించిన ఎంపిక కమిటీ జీవో ఎంఎస్ 34 లోని నిబంధనలు మరియు యు.జి.సి ఎంఎస్ నెంబర్ 14 లోని నిబంధనలు మేరకు జరుగుతాయి.
Anganwadi Supervisors Appointments పోస్టుల వివరాలు
విశాఖపట్నంలో 199 పోస్టులు మంజూరు చేయగా 123 పోస్టులను ప్రభుత్వం ఇదివరకే భర్తీ చేసింది. అదేవిధంగా ఏలూరులో 246 పోస్టులకుగాను 120 పోస్టులు భర్తీ చేసింది. ఒంగోలులో 237 మంజూరైన పోస్టులకుగాను 95 పోస్టులను భర్తీ చేసింది. కర్నూల్ లో 294 మంజూరైన పోస్టులకుగాను 78 పోస్టులను భర్తీ చేసింది. మిగిలిన 560 వేకెన్సీ లను ప్రభుత్వం భర్తీ చేయడానికి ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
తేదీ 15.02.2022 వరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రేడ్ 2 సూపర్వైజర్ వేకెన్సీ వివరాలు
- విశాఖపట్నం 76
- ఏలూరు 126
- ఒంగోలు 142
- కర్నూలు 216
- మొత్తం వేకెన్సీ లు 560
మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేసి ప్రభుత్వ ఉత్తర్వులు కాపీని డౌన్లోడ్ చేసుకోండి.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.