EntertainmentTrivikram – Allu Arjun : బన్నీ...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

Trivikram – Allu Arjun : బన్నీ కోసం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్న త్రివిక్రమ్.. అసలు ఆట ఇప్పుడు మొదలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Trivikram – Allu Arjun : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో ఎంత పెద్ద హిట్ అందరికి తెలిసిందే. ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యనారాయణమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు ఈ కాంబో. అయితే ఇప్పుడు మన డైరెక్టర్స్ అంతా కొత్త కాన్సెప్ట్స్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా డైరెక్టర్స్ గా మారుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ కూడా స్టార్ డైరెక్టర్ అయినా ఇప్పటివరకు పాన్ ఇండియా వైపు చూడలేదు. ఇప్పటివరకు త్రివిక్రమ్ అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథలు, తన డైలాగ్స్ తోనే లాక్కొచ్చాడు. ప్రయోగాత్మక సినిమాల జోలికి త్రివిక్రమ్ పోలేదు.

కానీ ఇప్పుడున్న కాంపిటేషన్ కి, పాన్ ఇండియా బిజినెస్ కి త్రివిక్రమ్ కూడా అప్డేట్ అవ్వక తప్పదని అర్ధం చేసుకున్నట్టు ఉన్నారు. ఇటీవల మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాతో వచ్చి హిట్ కొట్టిన త్రివిక్రమ్ నెక్స్ట్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు. పుష్ప 2 తర్వాత బన్నీతోనే త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు ప్రకటించిన సంగతి తెలిసందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ లోనే బన్నీ – త్రివిక్రమ్ సినిమా రాబోతుంది.

అయితే పుష్ప 2 లాంటి మాస్ పాన్ ఇండియా సినిమా తర్వాత మళ్ళీ క్లాస్ త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి టాలీవుడ్ సినిమా అల్లు అర్జున్ చేస్తాడా అనుకున్నారు. కానీ ఇది పాన్ ఇండియా సినిమా అని క్లారిటీ వచ్చేసింది. తాజాగా అనిర్మాత బన్నీ వాసు ఆయ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడుతూ.. త్రివిక్రమ్ గారు మొదటి సారి ఓ కొత్త కాన్సెప్ట్ సినిమాతో రాబోతున్నారు. బన్నీ – త్రివిక్రమ్ గారిది ఇది పాన్ ఇండియా సినిమా. త్రివిక్రమ్ గారికి పాన్ ఇండియా క్యాపబిలిటీ ఉందని బన్నీ నమ్మారు. గత రెండేళ్లుగా ఈ సినిమా గురించి చర్చలు జరిగి ఫైనల్ గా ఒక లైన్ ఓకే చేశారు. ఆ సినిమాకి కనీసం సంవత్సరం అయినా ప్రీ ప్రొడక్షన్ పడుతుంది. భారీ బడ్జెట్ తో ఆ సినిమా ఉండబోతుంది. బన్నీ కెరీర్ లోనే భారీ బడ్జెట్. ఆ సినిమా కోసం ఇప్పట్నుంచే చినబాబు గారు, అల్లు అరవింద్ గారు ఫైనాన్షియర్స్ ని వెతుకుతున్నారు. చాలా పెద్ద సినిమా అవుతుంది అది అని తెలిపారు.

దీంతో త్రివిక్రమ్ తన రూట్ మార్చి బన్నీ కోసం ఓ సరికొత్త కాన్సెప్ట్ రాసుకొని పాన్ ఇండియా సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ సినిమా మీదే వర్క్ చేస్తున్నారు. పుష్ప 2 అయ్యాక ఆ సినిమానే మొదలవుతుంది. ఇన్నాళ్లు తన మాటలతో టాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించిన త్రివిక్రమ్ ఇప్పుడు పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో త్రివిక్రమ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కూడా త్రివిక్రమ్ స్టైల్ చూసి ఆశ్చర్యపోతారని, ఇక నుంచి త్రివిక్రమ్ కొత్త స్టైల్ చూపిస్తాడని ఆశిస్తున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this