EducationSupreme court: నీట్‌పై విచారణ.. ఫలితాలపై సుప్రీంకోర్టు...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Supreme court: నీట్‌పై విచారణ.. ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు, ఆయా పార్టీలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. తాజాగా ఇదే వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఇక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జులై 22న తిరిగి విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలను కనిపించకుండా చూడాలని సూచించింది.

నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని సందర్భంగా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వాదనలు కొనసాగాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం, ప్రశ్నపత్రం లీకేజీ కేవలం పాట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైనట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది.

అయితే గుజరాత్‌లో అలాంటిదేమీ జరగలేదని చెప్పలేమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పేపర్‌ లీక్‌ కొన్ని కేంద్రాలకే పరిమితమైందా? లేదా ఇతర కేంద్రాలు, దేశవ్యాప్తంగా వ్యాపించిందా? అనే విషయాలు తెలిసేందుకు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచడం కీలకమని వ్యాఖ్యానించింది. అయితే విద్యార్థుల గోప్యత దృష్ట్యా వారి వివరాలు కనిపించకుండా ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this