NewsRevanth Reddy: ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Revanth Reddy: ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్.. చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఎంతోమందిని రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కమ్మవర్గం సహకారం అందించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇస్తుందన్నారు. హెచ్‌ఐసీసీలో జరిగిన కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు నచ్చని విషయాలపై నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు సీఎం రేవంత్. దాన్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు తెలియజేశాయన్నారు.

తెలుగువారైన వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారని అంతా ఆశించామని, కానీ కాకపోవడం నిరాశ కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు ఢిల్లీలోనూ తెలుగువారి నాయకత్వం ఉండేదని.. ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మళ్లీ ఆ అలాంటి నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. కమ్మసంఘం కోసం గత ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చి ఎన్నో లిటిగేషన్లు పెట్టిందని సీఎం రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వాటిని పరిష్కరించడంతో పాటు భవన నిర్మాణానికి కూడా సహకరిస్తుందన్నారు.

వీడియో చూడండి..

ఎన్టీఆర్ లైబ్రరీలో తాము చదువుకున్న చదువు ఇవాళ ఉన్నత స్థానాలకు రావటానికి ఉపయోగ పడిందని.. దీనిని గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏ మాత్రం భయపడనంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎన్జీ రంగా.. వెంకయ్య నాయుడు.. లాంటి నేతల పేర్లను చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి… ఈ నాడు.. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాల్సిన అవసరమే లేదంటూ వివరించారు. దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయన్నారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని.. కులాన్ని అభిమానిస్తాం.. ఇతర కులాలను గౌరవిస్తామంటూ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదని.. అది తమ ప్రభుత్వ విధానం కాదంటూ స్పష్టంచేశారు.

వీడియో చూడండి..

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this