EntertainmentCinemaMass Maharaja రేసులోకి మాస్ మహరాజా.. ఆగస్టు...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Mass Maharaja రేసులోకి మాస్ మహరాజా.. ఆగస్టు 15 కోసం ఎందుకంత పోటీ అంటే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గత కొన్ని రోజులుగా ఏ రోజున ప్రేక్షకుల ముందుకు రావాలని చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాడు మాస్ మహరాజా రవితేజ. హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15న విడుదల అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాంతో ఆగస్ట్ 15న రసవత్తరమైన పోటీ నెలకొంది. అదీకాక 14వ తారీఖున స్పెషల్ ప్రీమియర్స్ వేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ ల మాస్ యాక్షన్ ‘డబుల్ ఇస్మార్ట్’ తో పాటుగా, పా. రంజిత్ దర్శకత్వంలో  కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రయోగాత్మకంగా నటించిన ‘తంగలాన్’ వస్తున్నాయి. అయితే ఈ డేట్ కోసం ఇంత పోటీ ఎందుకో ఓసారి పరిశీలిద్దాం.

మేకర్స్ కు సినిమాను పూర్తి చేయడం ఎంత పెద్ద టాస్కో.. ఆ మూవీని కరెక్ట్ టైమ్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా అంతే పెద్ద రిస్క్. డేట్స్ కొద్దిగా అటూ, ఇటూ అయినా.. సినిమా ఫలితంపై అది ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అందుకే మంచి టైమ్ చూసుకుని విడుదల తేదీలను అనౌన్స్ చేస్తుంటారు చిత్ర నిర్మాతలు. అయితే తాము అనుకున్న డేట్ కు మరికొన్ని సినిమాలు రిలీజ్ కు ఉండి ఉండొచ్చు. కానీ ఇదే సరైన సమయం అని వారు భావించి, తమ సినిమాపై ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే? ప్రస్తుతం ఆగస్ట్ 15 తేదీ కోసం విపరీతమైన పోటీ నెలకొంది టాలీవుడ్ లో. ఈ డేట్ న ఏకంగా మూడు పెద్ద సినిమాలే రాబోతున్నాయి.

రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ తో పాటుగా పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన ప్రయోగాత్మక చిత్రం తంగలాన్ కూడా వస్తోంది. ఇక ఇదే రోజున మిస్టర్ బచ్చన్ గా బరిలోకి దిగబోతున్నట్లు మాస్ మహరాజా రవితేజ అనౌన్స్ చేశాడు. దాంతో పోటీ తీవ్రంగా మారింది. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఇదే డేట్ కోసం ఇంత పోటీ పడటానికి ప్రధాన కారణం లాంగ్ వీకెండ్ ఉండటమే. ఆగస్ట్ 15 సెలవు కావడం, ఆ తర్వాత వీకెండ్ ఉండటం, అదీకాక సోమవారం రాఖీ పండుగ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకునే మేకర్స్ ఈ డేట్ కోసం ఇంత పోటీ పడ్డారు. ఇక మూడు సినిమాలు కూడా టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకున్నాయి. ఎవరికి వారే హిట్ కొడతాం అని ధీమాగా ఉన్నారు. సినిమా ఫ్యాన్స్ కూడా మూడు సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఆగస్ట్ 15న ఎవరిది పైచేయి అవుతుందో.



Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this