CrimeGujarat Wife Secret : పెళ్లైన ఏడాదికి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Gujarat Wife Secret : పెళ్లైన ఏడాదికి బయటపడ్డ భార్య సీక్రెట్.. డాక్టర్ వద్దకు వెళ్లడంతో తెలిసిన నిజం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Gujarat Wife Secret గుజరాత్ అహ్మదాబాద్‌కి చెందిన వ్యక్తికి పెళ్లైన తర్వాత తన భార్య గురించి సంచలన విషయం తెలిసింది. దీంతో తనను మోసం చేశారని సదరు వ్యక్తి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. తప్పుడు వయసు చెప్పి తనకు ఆ మహిళని అంటగట్టారని సర్ఖేజ్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. అయితే, పెళ్లై ఏడాది గడుస్తున్నా తమకు పిల్లలు పుట్టడం లేదని తన భార్యను తీసుకుని డాక్టర్ వద్దకు వెళ్లిన సమయంలో భర్తకు తన భార్య వయసును దాచిన సంగతి తెలిసింది.

Gujarat Wife Secret పెళ్లి సమయంలో సదరు మహిళకు 32 ఏళ్లని చెప్పారని, విచారణలో మాత్రం 40 ఏళ్లకు పైగా ఉంటుందని డాక్టర్ చెప్పినట్లు సదరు వ్యక్తి చెప్పారు. ఈ జంట సహజంగా గర్భం దాల్చే అవకాశం లేదని సోనోగ్రఫీ నివేదిక ద్వారా వైద్యులు నిర్ధారించారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన వ్యక్తి వేజల్‌పూర్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. భార్యతో పాటు ఆమె తండ్రి, బంధువులపై కేసు పెట్టాడు. నమ్మకాన్ని ఉల్లంఘించడం, ఫోర్జరీ చేయడం, మోసం చేయడం, నేరపూరిత కుట్ర మరియు బెదిరింపులకు సంబంధించిన IPCలోని బహుళ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Husband Wife : తగ్గేదే లే అన్నట్టు ఒకరికి ఒకరు ట్విస్ట్ లు ఇచ్చుకున్న భార్యా భర్తలు… అదేంటో మీరే చూడండి..

Gujarat Wife Secret

‘‘తన భార్య బయోడెటాలో ఆమె పుట్టిన తేదీ మే 18, 1991 అని చూపబడింది, ఆమె నా కంటే 18 నెలలు చిన్నది. ఆమె కుటుంబాన్ని కలుసుకున్న తర్వాత, మా వివాహం జూన్ 19, 2023కి నిర్ణయించబడింది. అమ్మాయి కుటుంబం పాలన్‌పూర్‌లోని ఒక గ్రామంలో వివాహం జరపాలని అభ్యర్థించారు’’ అని ఎఫ్ఐఆర్‌లో వ్యక్తి పేర్కొన్నాడు. తాను పదేపదే తన భార్య వయసు, విద్యార్హత రుజువులు చూపించాలని కోరినప్పటికీ, ఆమె కుటుంబం దాటవేసేదని చెప్పారు. పెళ్లి రోజు ఆమె స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ కాపీని చూపించారని, వివాహ రిజిస్ట్రేషన్‌లో తన భార్య పుట్టిన రోజు మే 18, 1991గా చెప్పినట్లు పోలీసులకు వెల్లడించారు.

Gujarat Wife Secret గర్భం దాల్చకపోవడంతో తన అత్త, మరదలు తన భార్యను జుహాపురాలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించారని, అయితే దానికి సంబంధించిన రిపోర్టులు తనకు చూపించలేదని సదరు వ్యక్తి చెప్పారు. సెప్టెంబరు 2023లో, తాము పాల్డిలోని గైనకాలజిస్ట్‌ని సంప్రదించామని, డాక్టర్ ప్రకారం తన భార్యకు 40 నుండి 42 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు సోనోగ్రఫీ నివేదిక సూచించిందని, ఆమె సహజంగా గర్భం దాల్చదని అతను చెప్పాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నాడు. పెళ్లి అయిన తర్వాత బ్యాంకింగ్ ప్రయోజనాల కోసం వివాహాన్ని నమోదు చేయమని నేను అడిగినప్పుడల్లా నా భార్య ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకుండా తప్పించుకుందని చెప్పాడు. ఆమె సోదరులు ఆమే డేట్ ఆఫ్ బర్త్‌ని మే 18, 1985 నుండి మే 18, 1991కి మార్చారని ఆరోపించాడు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this