EntertainmentCinemaActor Naresh: సడెన్‏గా వదిలేసి వెళ్లిపోయింది.. ఒంటరైన...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Actor Naresh: సడెన్‏గా వదిలేసి వెళ్లిపోయింది.. ఒంటరైన నరేష్.. వెక్కి వెక్కి ఏడ్చిన నటుడు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, సహాయ నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు నరేష్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఆకస్మాత్తుగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. తన బేబీ ఎక్కడో తప్పిపోయిందని.. దీనంగా కనిపించన వారందరినీ అడుగుతున్నాడు. అది ఒక్కరోజు కంటికి కనిపించకపోయినా.. ఇంటిళ్లిపాదికి ముద్ద కూడా దిగదని.. ఎవరికైనా తన బేబీ కనిపిస్తే కబురు పెట్టమంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పైగా అందరూ కల్కి సినిమాలోని బుజ్జి తెలుసుగానీ.. ఈ బేబీ ఎవరో తెలియదంటూ హేళన చేస్తున్నారని.. తమ బేబీని ఎలాగైన వెతికి పెట్టమని ఏకంగా కల్కి చిత్రయూనిట్ తోపాటు డైరెక్టర్ నాగ్ అశ్వి్న్ ను ట్యాగ్ చేశాడు. కల్కి సినిమా వాళ్లకు బుజ్జి ఎలాగో.. తనకు బేబీ కూడా అలాగే అని.. ఎలాగైనా తన బేబీ కనిపిస్తే దొరికేటట్టు చేయాలని రిక్వెస్ట్ చేశాడు. నరేష్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోయారు. అసలు బేబీ ఎవరు..? ఎందుకు వదిలేసి పోయిందని షాకవుతుండగా.. వీడియో చివర్లో అసలు విషయం బయటపెట్టేశాడు.

నటుడు నరేష్ షేర్ చేసిన ఎమోషనల్ వీడియోకు కారణం తన కొత్త సినిమా ప్రమోషనే. ఈరోజుల్లో సినిమా తెరకెక్కించడం కంటే ప్రమోషన్స్ చేయడమే చాలా కష్టమైంది. జనాలకు తమ సినిమాను ప్రచారం చేయడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇటీవలే డార్లింగ్ సినిమా కోసం ప్రియదర్శి, నభా నటేష్ కొత్తగా ట్రై చేయగా.. ఇప్పుడు నరేష్ కూడా తన కొత్త సినిమా వీరాంజనేయులు విహారాయాత్ర కోసం ఈ వెరైటీ ప్రమోషన్ చేశాడన్నమాట. ఈ చిత్రంలో నరేష్ తోపాటు హాస్యబ్రహ్మా బ్రహ్మానందం కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీతో రూపొందించిన ఈసినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకత్వం కాబోతున్నాడు. అలాగే ఈ మూవీలో కీడా కోలా ఫేమ్ రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఎప్పుడు గొడవలు పడుతుంటే ఓ కుటుంబం విహారయాత్రకు వెళ్లి సరదాగా గడపాలని నిర్ణయించుకుంటుంది. దీంతో ఫ్యామిలీ మొత్తం గోవా వెళ్లాలనుకుంటారు. ఇందుకు తమ వద్ద ఉన్న పాత మెటాడోర్ వ్యాన్ కు కాస్త రంగులు వేసి అందంగా ముస్తాబుచేస్తారు. ఈ గోవా ప్రయాణంలో తమకు ఎదురైన పరిస్థితులే ఈ సినిమా అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు నరేష్ షేర్ చేసిన ఒక్క వీడియోతో ఈ సినిమాకు ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ట్యాగ్ చేయడంతో ఈ వీడియోకు ఎక్కువగా రెస్పాన్స్ వస్తుంది. అటు కల్కి అడియన్స్, ప్రభాస్ అభిమానులు కూడా ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. బేబీని కనిపెట్టడంలో బైరవ బుజ్జి హెల్ప్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this