Spiritualఆ గుడిలో స్వామిని దర్శించుకోవాలంటే.. భక్తులకు లగేజీ...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

ఆ గుడిలో స్వామిని దర్శించుకోవాలంటే.. భక్తులకు లగేజీ భారం తప్పదా.! –

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి దర్శనం కోసం వస్తున్న యాత్రికులకు ఆలయం వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో దాదాపు 15 వేల మంది భక్తులు ప్రతిరోజూ శ్రీ గోవిందరాజ స్వామిని కూడా దర్శించుకుంటారు. తిరుపతి రైల్వే స్టేషన్‎కు పక్కనే ఉన్న శ్రీ గోవిందరాజ స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8:30 వరకు స్వామివారికి నిత్య కైకార్యాలు జరుగుతుండగా రాత్రి 9 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో గోవిందరాజ స్వామి దర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్న భక్తులకు ఆలయం వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. గోవిందరాజ స్వామి దర్శనానికి వెళ్లాలంటే వెంట తెచ్చుకున్న లగేజీతోనే ఆలయ ప్రవేశం చేయాల్సిన రావడం ఇబ్బందికరంగా మారింది. లగేజీ భద్రపరిచేందుకు కౌంటర్‎లు లేకపోవడంతో లగేజీ బ్యాగ్‎లతోనే భక్తులు దర్శనానికి వెళుతున్న పరిస్థితి నెలకొంది.

గత 6 నెలలుగా ఆలయం బయట లగేజీ కీపింగ్ సెంటర్‎ను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మూసివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో గోవిందరాజ స్వామిని దర్శించుకుంటున్నడంతో వారి వెంట ఉండే లగేజీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ లగేజీని బయట పెట్టే అవకాశం లేకపోవడంతో భక్తులు లగేజీ బరువుతో స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి వస్తోంది.
లగేజీ బ్యాగులతో భక్తులు దర్శనానికి వెళుతుండడంతో క్యూ లైన్‎లలో కూడా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు లగేజీ తనిఖీ కూడా అంతంత మాత్రమే ఉండడంతో భద్రత సమస్య కూడా ఆందోళన కలిగిస్తుంది. బ్యాగుల్లో నిషేధిత వస్తువులు తీసుకెళితే భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. గత ఆరు నెలలుగా ఈ సమస్య ఉండడంతో ఆలయ సిబ్బంది విషయాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా లగేజీ భద్రపరిచే కౌంటర్లను తెరవకపోవడంతో భక్తులకు లగేజీ భారం మరింతగా పెరిగింది. లగేజీ బ్యాగులతో దర్శనానికి వెళ్లడం కూడా ఎంతో ఇబ్బందిగా మారిందిన్న వాదన భక్తుల నుంచి వినిపిస్తోంది.

ఇక శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద లగేజీ సమస్య 6 నెలలుగా భక్తులను పట్టిపీడిస్తుంటే చెప్పులు వదిలేందుకు కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏప్రిల్ ఒకటి నుంచి షూ కీపింగ్ సెంటర్‎ను కూడా మూసి వేయడంతో వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఎక్కడపడితే అక్కడ చెప్పులు వదిలి వెళుతున్న పరిస్థితి ఉంది. లేదంటే చెప్పులు, లగేజీల కోసం యాత్రికుల్లో ఒకరిని కాపలాగా పెట్టి మిగతావారు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయంలోకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. సమస్య ఇంత తీవ్రంగా మారినా టీటీడీ భక్తుల ఇబ్బందులను అసౌకర్యాన్ని గుర్తించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this