Monday, September 29, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
JVK Kits 2022-23 Jagananna Vidya Kanuka...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

JVK Kits 2022-23 Jagananna Vidya Kanuka – Receiving, Distribution Guidelines

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

JVK Kits 2022-23 Jagananna Vidya Kanuka – Receiving, Distribution Guidelines JVK 3 Material Jagananna-vidya-kanuka-jvk-kits-2022-23-recieving-distribution-guidelines-to-hms-meos-complex-hms-teaches-crps

ఆర్.సి.నెం.5-16021/50/2021-CMO SEC SSA. తేది: 29.06.2022

jvk kits 2022-23 jagananna vidya kanuka - receiving, distribution guidelines

Download Latest Jagananna Vidya Kanuka App 

JVK Registers for AY 2022-2023  

JVK Kit Distribution Guidelines

DAILY School Level JVK – 3 KITS’ 2022 Distribution Google FORM

Know Your JVK Latest User ID

JVK Kits 2022-23 Jagananna Vidya Kanuka – Receiving, Distribution Guidelines

విషయం: ఆంధ్ర ప్రదేశ్ సమగ్రశిఖా ‘జగనన్న విద్యా కానుక 2022 – 23 జిల్లా కేంద్రం, మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు వస్తువులు వారీగా సరఫరా విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు స్టూడెంట్ కిట్లు రూపకల్పన జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు, సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు జారీచేయుట గురించి.

ముఖ్యంగా గమనించవలసిన విషయాలు:

  • ‘జగనన్న విద్యా కానుక’లో భాగంగా ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, నిఘంటువును (ఒకటవ తరగతి విద్యార్ధులకు pictorial డి.క్షనరీ మరియు ఆరవ తరగతి విద్యార్థులకు Oxford డిక్షనరీ) కిట్ రూపంలో అందించవలసి ఉంటుంది.. 
  • ఈ కిట్ లో భాగంగా తరగతి వారీగా ప్రతి విద్యార్థికి ఏయే వస్తువులు ఇవ్వాలో ‘అనుబంధం-1’లో పొందుపరచడమైనది. దీనిని ప్రతి ఒక్కరూ గమనించగలరు. 
  • ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్ / మండల పరిధిలో మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పరస్పర సహకారంతో పని చేయాలి.
  • దీనికి సంబంధించి నోటు పుస్తకాలు, బ్యాగులు మరియు బెల్టులు స్కూల్ కాంప్లెక్సులకు, యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు & రెండు జతల సాక్సులు మండల రిసోర్సు కేంద్రాలకు మరియు డిక్షనరీలు జిల్లా కేంద్రాలకు అందజేస్తారు.

పంపిణీకి ముందు ఎంఆర్సీ / స్కూల్ కాంప్లెక్సుల్లో చేయవలసినవి:

  • ‘జగనన్న విద్యాకానుక’కు సంబంధించి అన్ని వస్తువులు స్కూల్ కాంప్లెక్సులకు చేరిన తర్వాత భద్రపరిచే గదిలో వెలుతురు తగిలేలా, ఎలుకలు, చెదలు వంటివి లేకుండా తడి, చెమ్మ లేకుండా, వర్షం నీరు రాకుండా ఉండేలా భద్రతా ప్రమాణాలు పాటించాలి. పాఠశాలలకు పంపీలా సిద్ధంగా ఉంచాలి.  
  • మీరు తీసుకోవలసిన వస్తువుల్లో ఏవైనా డ్యామేజ్ అయినా. సరిపడా సైజు లేకపోయినా, చినిగిపోయినా సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆ వివరాలను ఎంఆర్సీ కేంద్రం / స్కూల్ కాంప్లెక్స్ లో ఉంచిన స్టాకు రిజిస్టరులో నమోదు చేసి ఆ సమాచారాన్ని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారికి లేదా సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వారికి తెలియజేయాలి.
  • ఈ విధంగా సరుకు సరఫరా అయిన తర్వాత అందరు ప్రధానోపాధ్యాయులు నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, అదనముగా కావలసిన వస్తువుల వివరాలను మండల విద్యాశాఖాధికారి వారు జిల్లా విద్యాశాఖాధికారి వారికి మరియు సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ (ఏపీసీ) సమాచారాన్ని అందజేయాలి.
  • మండల కేంద్రాల నుంచి సంబంధిత వస్తువులు స్కూల్ కాంప్లెక్సులకు చేర్చే విధానాన్ని ఈ క్రింది తెలియచేయడమైనది.

మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు సరఫరా చేయు విధానం:

  • యూనిఫాం మండల రిసోర్సు కేంద్రానికి చేరుతాయి.
  • యూనిఫాంకు సంబంధించిన ప్యాక్ కవర్ పైన బాలికలకు సంబంధించినవైతే ‘G’ అని. బాలురకు సంబంధించినవైతే ‘B’ అని, దీంతోపాటు తరగతి అంకె ముద్రించి ఉంటుంది. ఎవరిదైతే వారి దగ్గర టిక్’ మార్క్ ముద్రించి ఉంటుంది.
  • బేల్ లో యూనిఫాం ప్యాకెట్లు ఉంటాయి.
  • ఒక్కొక్క టీల్లో ఎన్నెన్ని ప్యాకెట్లు ఉంటాయో ముద్రించి ఉంటుంది.
  • ఒక్కొక్క టీల్లో ఎన్నెన్ని ప్యాకెట్లు ఉంటాయో ముద్రించి ఉంటుంది.

  • ఎంఆర్సీలో ఏర్పాటు చేసిన ఓ గదిలో తరగతి వారీగా బాలుర యూనిఫాం, బాలికల యూనిఫాం విడివిడిగా పెట్టుకోవాలి. 
  • స్కూల్ కాంప్లెక్స్ వారిగా ఎంత యూనిఫాం పంపిణీ చేయాలో ముందుగానే అన్ని జిల్లా కేంద్రాలకు తెలియచేయడం జరిగినది. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం మాత్రమే సంబంధిత పాఠశాలలకు జారీచేయాలి. ప్రధానోపాధ్యాయులు తరగతి వారీగా బాలబాలికలకు ఎన్ని యూనిఫాం ప్యాకెట్లు కావాలో ఎంఆర్సీలో సమాచారం అందించాలి.
  • ప్రధానోపాధ్యాయులు ఒక్కో తరగతికి చెందిన బాలబాలికల యూనిఫాం క్లాత్ తీసుకున్న తర్వాత రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం సరిచూసుకోవాలి.

ఆ) బూట్లు &సాక్సులకు సంబంధించి:

  • మండల రిసోర్సు కేంద్రాలకు / స్కూల్ కాంప్లెక్సులకు బూట్లు, సాక్సుల సరుకు లోడు వచ్చిన తర్వాత బూట్లు, లు అబ్బాయిలకు అమ్మాయిలకు విడివిడిగా ఏర్పాటు చేసుకోవాలి.
  • రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం మాత్రమే సంబంధిత పాఠశాలలకు జారీచేయాలి.
  • బాలబాలికలకు సంబంధించి బూట్లు సైజులు, తీసుకెళ్లవలసిన సాక్సులు వివరాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, యన్ టి ఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు. బాపట్ల జిల్లాల వరకు ఈ క్రింది విదంగా ఉంటాయి.
  • బాలబాలికలకు సంబందించి బూట్లు సైజులు, తీసుకెళ్లవలసిన సాక్సులు వివరాలు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూల్, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్య సాయి, వై యస్ ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూర్ జిల్లాల వరకు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • బూట్లు, సాక్సులు స్కూల్ కాంప్లెక్సులకు ఇచ్చేముందు ఎంఆర్సీలో సైజులు వారీగా బూట్లు, సాక్సులు ప్రదర్శించడానికి టేబుళ్లు ఏర్పాటు చేసుకోవాలి. పేపర్ పై బూట్లు సైజులను స్పష్టంగా కనిపించేలా రాసుకుని టేబుళ్లకు అంటించి డిస్ ప్లే చేయాలి.
  • ఏ స్కూల్ కాంప్లెక్స్ పాఠశాలలకు బూట్లు, సాక్సులు పంపిణీ చేస్తున్నామో సంబంధిత ప్రధానోపాధ్యాయునికి ముందుగానే తెలియపరచి, నిర్ణీత తేదీ, సమయానికి వారికి ఎన్ని బూట్లు, సాక్సులు కావాలో సైజులవారి పూర్తి సమాచారంతో ఎంఆర్సీకి ప్రధానోపాధ్యాయులు వచ్చేలా తెలియజేయాలి.
  • ప్రధానోపాధ్యాయులు ఎంఆర్పీ కేంద్రానికి వచ్చేముందు రెండు పెద్ద గోనె సంచులు, సైజులు వారీగా బూట్లు, సాక్సులను తీసుకెళ్లడానికి తగినన్ని పెద్ద సైజు కవర్లను, కట్టేందుకు తాళ్లు తీసుకురావాలి.

యూనిఫాం క్లాత్, బూట్లు & సాక్సులు సరఫరా విధానం:

ఎంఆర్సీ / స్కూల్ కాంప్లెక్స్ లో పంపిణీ చేసేముందు సిద్ధం చేసుకోవలసిన వస్తువులు:
  • * టేబుళ్లు, కుర్చీలు
  • * డిస్ ప్లే బోర్డు
  • * మార్కర్లు
  • * స్టాఫర్
  • * శానిటైజర్
  • నిర్ణీత తేదీల్లో ఎంఈవో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఒక స్కూల్ కాంప్లెక్స్ చైర్మెన్, ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ప్రధానోపాధ్యాయులు ఎంఆర్పీకి చేరుకోవాలి. 
  • రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం మాత్రమే సంబంధిత పాఠశాలలకు జారీచేయాలి.
  • కోవిడ్ 19 నిబంధనలతో పాటు శానిటైజర్, మాస్క్, భౌతికదూరం తప్పనిసరి.
  • తర్వాత వారికి కావలసిన యూనిఫాం, బూట్లు&సాక్సులు తీసుకోవడానికి ఆయా సైజుల వారిగా సిద్ధం చేసిన బూట్లు టేబుళ్ల దగ్గరకు వెళ్లాలి.

బాలురకు సంబంధించి:

  • బాలు బూట్లు, సాక్సులు ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి, అక్కడ సిబ్బందికి స్మాల్ సైజుకు చెందిన ఒకటో నంబరు.
  • బూట్లు రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం తీసుకోవాలి.
  • సిబ్బంది ఒకటో నంబరు బూట్లు ఇచ్చిన తర్వాత ఆ బూట్లుపై సైజు రాసి ఉందా లేదా? బూట్లు, తగినన్ని సాక్సులు సరిగా ఉన్నాయా లేదా అక్కడికక్కడే పరిశీలించుకుని ఒక్కో ప్యాకెట్ కు పిన్ కొట్టాలి. తర్వాత ఒకటో నెంటరు బూట్లన్నీ వెంట తెచ్చుకున్న ఒక కవరులో వేసుకుని తాడుతో కట్టాలి. ఇలా చేయడం వల్ల ఒకదానికొకటి కలిసిపోకుండా ఉంటాయి. పాఠశాలలకు ఇచ్చేటప్పుడు సులభతరం అవుతుంది..
  • తర్వాత ఆ కవర్ మీద బాలురు బూట్లు కాబట్టి B అని, సైజ్, తీసుకున్న బూట్లు సంఖ్య మార్కర్ తో రాసి పెద్ద గోనె సంచిలో వేసుకోవాలి. 
  • అనంతరం రెండో సైజు బల్ల దగ్గరకు, మిగతా బల్లల దగ్గరకు వెళ్లి అదే పద్ధతిని పాటించాలి.
  • బాలురకు చెందిన బూట్లు సాక్సులన్నీ తీసుకుని పెద్ద గోనె సంచిలో వేసిన తర్వాత ఆ గోసెను తాడుతో కట్టాలి. ఆ గోనె సంచి మీద ‘స్కూల్ కాంప్లెక్స్ పేరు, బాలురు’ అని రాసి ఆ సంచి ఒక పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత ఒకటో తరగతి బాలుర యూనిఫాం టేబుల్ / గది దగ్గరకు వెళ్లాలి..
  • ఒకటో తరగతి బాలురుకు సంబంధించి ఎన్ని యూనిఫాం కవర్లు కావాలో తీసుకోవాలి. అవన్నీ ఒక గోనె సంచిలో వేసుకుని ఆ గోసెపై బాలురు యూనిఫాం స్కూల్ కాంప్లెక్స్ పేరు’ రాసి సిద్ధంగా ఉంచుకోవాలి.
  • ఇలా అన్ని తరగతులకు చెందిన యూనిఫాం క్లాత్స్ తరగతి వారీగా గోనె సంచుల్లో వేసుకోవాలి.

బాలికలకు సంబంధించి:

  • బాలికల బూట్లు, సాక్సులు ఉన్న బల్ల దగ్గరకు వెళ్లి, అక్కడ సిబ్బందికి స్మాల్ సైజుకు చెందిన ఒకటో నంబరు
  • బూట్లు రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం తీసుకోవాలి. • సిబ్బంది ఒకటో నంబరు బూట్లు ఇచ్చిన తర్వాత ఆ బూట్లుపై సైజు రాసి ఉందా లేదా? బూట్లు, తగినన్ని
  • సాక్సులు సరిగా ఉన్నాయా లేదా అక్కడికక్కడే పరిశీలించుకుని ఒక్కో ప్యాకెట్ కు పిన్ కొట్టాలి. తర్వాత ఒకటో నెంటరు బూట్లన్నీ వెంట తెచ్చుకున్న ఒక కవరులో చేసుకుని కట్టుకోవాలి. 
  • కవర్ మీద బాలికల బూట్లు కాబట్టి అని, సైజ్, తీసుకున్న బూట్లు సంఖ్య మార్కర్ తో రాసి పెద్ద గోస సంచిలో వేసుకోవాలి.
  • బాలికలకు చెందిన బూట్లు, సాక్సులన్నీ తీసుకుని పెద్ద గోనె సంచిలో వేసిన తర్వాత ఆ గోనెను తాడుతో కట్టాలి. ఆ గోనె సంచి మీద ‘స్కూల్ కాంప్లెక్స్ పేరు, బాలికలు’ అని రాసి ఆ సంచి ఒక పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత ఒకటో తరగతి బాలికల యూనిఫాం క్లాత్ టేబుల్/ గది దగ్గరకు వెళ్లాలి. ఒకటో తరగతి బాలికలకు సంబందించి ఎన్ని యూనిఫాం కవర్లు కావాలో తీసుకోవాలి అవన్నీ ఒక గోనె సంచిలో వేసుకుని ఆ గోనెపై ‘బాలికలు యూనిఫాం స్కూల్ కాంప్లెక్స్ పేరు రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. 
  • ఇలా అన్ని తరగతులకు చెందిన యూనిఫాం క్లాత్స్ తరగతి వారీగా గోనె సంచుల్లో చేసుకోవాలి.
  • యూనిఫాం సంచులు, బూట్లు మరియు సాక్సుల సంచులు తీసుకుని, ఎంఆర్సీలో ఏర్పాటు చేసిన కౌంటర్ దగ్గరకు వెళ్లాలి, మీరు వచ్చినప్పుడు ఆ కౌంటర్లో ఇచ్చిన సమాచారానికి, మీరు తీసుకెళ్తున్న యూనిఫాం, బూట్లు, సాక్సుల సంఖ్య సరిపోయిందా లేదా సరి చూసుకోని అక్కడ ఏర్పాటు చేసిన రిజిస్టర్ లో సంతకంపెట్టాలి. 
  • అనంతరం మండల రిసోర్సు కేంద్రం నుంచి స్కూల్ కాంప్లెక్సులకు యూనిఫాం క్లాక్స్, బూట్లు మరియు సాక్సుల సంచుల చేరవేయాలి.

స్కూల్ కాంప్లెక్సుల్లో సరఫరా విధానం: స్కూల్ కాంప్లెక్సు సిద్ధం చేసుకోవలసినవి:

  • స్కూల్ కాంప్లెక్సులకు నోటు పుస్తకాలు, బ్యాగులు మరియు బెల్టులు చేరుతాయి. ఇ) నోటు పుస్తకాలకు సంబంధించి: 
  • బాక్సుల్లో నోటు పుస్తకాలు స్కూల్ కాంప్లెక్సులకు చేరుతాయి. ఒక్కో బాక్సులో ఒకేరకానికి చెందిన నోటు
  • పుస్తకాలు ఉంటాయి. 
  • వైట్ నోట్ బుక్స్, రూల్డ్ నోట్ బుక్స్, బ్రాడ్ రూల్డ్, గ్రాప్ పుస్తకాలు ఇలా నాలుగు రకాల నోటు పుస్తకాలు ఉంటాయి.
  • ఒక్కో బాక్సులో ఎన్నెన్ని పుస్తకాలు ఉన్నాయో అట్ట మీద ముద్రించి ఉంటుంది. ప్రతి స్కూల్ కాంప్లెక్సుకు ఎన్నెన్ని వస్తువులు అందజేయబడతాయో ‘అనుబంధం-1 లో పొందుపరచడమైనది.
  • నోటు పుస్తకాలు సంబంధిత స్కూల్ కాంప్లెక్సుకు చేరగానే ‘అనుబంధం- 1″లో పేర్కొన్నట్లు సరిపోయినంత సరుకు వచ్చిందా లేదా సరి చూసుకోవాలి. లేనిపక్షంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సదరు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయాలి.

సరఫరా విధానం::

  • ఏయే తరగతికి ఏయే నోటు పుస్తకాలు ఎన్నెన్ని ఇవ్వాలో ఈ సర్క్యూలర్ తో పాటు ‘అనుబంధం- ‘
  • పొందుపరచడమైనది.
  • 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు బదులు వర్క్ బుక్స్ ఉంటాయి. 6వ తరగతి నుంచి 10 వ తరగతి విద్యార్థులకు తరగతికి తగినన్ని నోటు పుస్తకాలు ఇవ్వవలసి ఉంటుంది.
  • ఉదాహరణకు: 6వ తరగతి బాలబాలికలకు ఇవ్వవలసిన నోటు పుస్తకాలు గమనిస్తే.. 200 పేజీల వైట్ లాంగ్ (3), 200 పేజీల రూల్డ్ లాంగ్ (4), 200 పేజీల బ్రాడ్ రూల్డ్ (1) ఇలా మొత్తం 8 నోటు పుస్తకాలు అందజేయాలి.
  • వైట్ నోట్ బుక్స్ బాక్సులన్నీ ఒక చోట, రూల్డ్ నోట్ బుక్స్ బాక్సులన్నీ ఒక చోట, బ్రాడ్ రూల్డ్, గ్రాఫ్ పుస్తకాలు ఇలా నాలుగు రకాల నోటు పుస్తకాల బాక్సులు విడివిడిగా సిద్ధం చేసుకుని ఉంచాలి. స్కూల్ కాంప్లెక్సులకు రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం అన్ని తరగతులకు కలిపి విడివిడిగా పుస్తకాలు అందజేయాలి. 
  • ప్రధానోపాధ్యాయులు ‘ఇండెంట్ ప్రకారం వైట్ నోట్ బుక్స్, రూల్డ్ నోట్ బుక్స్, బ్రాడ్ రూల్డ్, గాప్ పుస్తకాలు విడివిడిగా తీసుకెళ్లాలి.

ఈ) బెల్టులకు సంబంధించి:

సప్లయిర్స్ నుంచి బెల్టులు స్కూల్ కాంప్లెక్సులకు చేరుతాయి.
బెల్టులు నాలుగు రకాలు అందజేయబడతాయి. 
  • ఎ) 1 నుంచి 5 వతరగతి బాలురు (80 సెంటీమీటర్లు)
  • బి) 6 నుంచి 8వ తరగతి బాలురు (90 సెంటీమీటర్లు)
  • సి) 9, 10వ తరగతి బాలురు (100 సెంటీ మీటర్లు)
  • డి) 1 నుంచి 5 వతరగతి బాలికలకు కాటన్ క్లాత్ బెల్ట్ (80 సెంటిమీటర్లు)

సరఫరా విధానం:

బాలబాలికలకు చెందిన బ్యాగులు స్మాల్. మీడియం, లార్జ్ సైజుల్లో విడివిడిగా సర్దుకోవాలి.

ఊ) డిక్షనరీలకు సంబంధించి:

సప్లయిర్స్ నుంచి జిల్లా కేంద్రాలకు నేరుగా డిక్షనరీలు అందుతాయి. 
ఒకటో తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, 6వ తరగతి విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కిట్ లో భాగంగా ఇవ్వవలసి ఉంటుంది.

సరఫరా విధానం:

జిల్లా కేంద్రం నుండి పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు ఎలా సరఫరా చేస్తారో అదే విధానాన్ని డిక్షనరీల సరఫరాకు పాటించాలి.

కిట్లు రూపకల్పన చేయు విధానం:

  • బ్యాగులు అందిన తర్వాత ‘స్టూడెంట్ కిట్’ సిద్ధం చేసి ప్రభుత్వం ఖరారు చేసిన తేదీ నాటికి ప్రతి విద్యార్థికి అందించేలా సన్నద్ధులై ఉండాలి.
  • ఏ తరగతి విద్యార్థికి ఏయే వస్తువులు ట్యాగులో వేసి సిద్ధం చేయాలో ‘అనుబంధం-11లో పొందుపరచడమైనది.
  • ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు. సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమిష్టి బాధ్యతగా భావించాలి.. 

ఉదాహరణకు ఆరో తరగతి అబ్బాయిలకు చెందిన స్టూడెంట్ కిట్ ఎలా సిద్ధం చేయాలో చూద్దాం.

1) మీడియం సైజు బ్యాగు తీసుకోవాలి.
2) ఆరో తరగతికి అబ్బాయిలకు కేటాయించిన 3 జతల యూనిఫాం క్లాత్ ప్యాకెట్ బ్యాగులో వేయాలి.
3) 200 పేజీల వైట్ లాంగ్ (3), 200 పేజీల రూల్డ్ లాంగ్ (4), 200 పేజీల బ్రాడ్ రూల్డ్ (1) ఇలా మొత్తం 8 నోటు పుస్తకాలు బ్యాగులో వేయాలి.
4) తర్వాత 6 వ తరగతి పాఠ్యపుస్తకాలు బ్యాగులో చేయాలి. 
5) బాలురకు సంబంధించి రెండు వైపులా నవారు కలిగిన బెల్టు (90cm) బ్యాగులో వేయాలి. 
6) 6 నుంచి 10వ తరగతికి కేటాయించిన ఒక ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని బ్యాగులో వేయాలి.
7) ఆ విద్యార్థికి సంబంధించిన సరిపోయే బూట్లు మరియు తగిన రెండు జతల సాక్సులు బ్యాగులో వేసుకోవాలి. 

* అనుంబంధం 11లో పేర్కొన్నట్లు ఇలా తరగతి వారిగా బాలురకు విడిగా, బాలికలకు విడిగా కిట్లు సిద్ధం చేసుకుని ఉండాలి.
* దీనితో స్టూడెంట్ కిట్ అన్ని వస్తువులతో సంపూర్ణంగా సిద్ధం చేసినట్లు పరిగణించాలి.
* సిద్ధం చేసేటప్పుడు బ్యాగు చినిగిపోకుండా, మిగతా వస్తువులు పాడవకుండా చాలా జాగ్రత్త వహించాలి. 
* ఇదే విధంగా ప్రతి పాఠశాలలోను బాలబాలికలకు సంబంధించిన కేట్లు సిద్ధం చేసుకోవాలి.
* ఈ కార్యక్రమం అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమష్టి బాధ్యతగా భావించాలి. 
* అందుకున్న వివిధ సరుకులకు సంబంధించిన వివరాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అందించబడిన వారి లాగిన్ నందు నమోదు చేయవలసి ఉంటుంది.
* కిట్కు సంబంధించిన వస్తువులు అందినవి అందినట్లు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ప్రధానోపాధ్యాయులు. మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులు నమోదు చేసిన వివరాలను (ఎన్ని వచ్చాయి? ఇంకా ఎన్ని అందాలి?) ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలి. 
* ”జగనన్న విద్యాకానుక’ వస్తువుల పంపిణీలో ఏవైనా సందేహాలు ఉన్న యెడల 99086 96785 నంబరులో కార్యాలయపు పనివేళ్లలో సంప్రదించగలరు మరియు cmo.apsamagrashiksha@gmail.com / spassapeshi@gmail.com నకు తెలియచేయగలరు.

స్టాక్  రిజిస్టర్ నిర్వహణ:

  • రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం, ప్రతి జిల్లా కార్యాలయం / మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సులో తప్పనిసరిగా ‘జగనన్న విద్యాకానుక’కు సంబంధించి ఒక స్టాకు రిజిస్టరును నిర్వహించాలి. స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. 
  • రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులు సంబంధిత మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సుకు తనిఖీ నిమిత్తం సందర్శించినప్పుడు స్టాకు రిజిస్టర్ తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది. 
  • స్టాక్ రిజిస్టర్ నమూనా (ఫార్మెట్) మరియు నిర్వహణపై మార్గదర్శకాలు ఇదివరకే ఇవ్వడమైనది.
  • డెలివరీ చలానాలు:
  • ప్రతి జిల్లా కార్యాలయం / మండల రిపోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సులో ‘జగనన్న విద్యాకానుక’ కు సంబంధించి వస్తువులు వచ్చిన తర్వాత అవి సరిచూసుకున్న తర్వాత చలానాల్లో సంతకాలు పెట్టాలి. 
  • సప్లయిర్స్ ఇచ్చే 3 చలానాల్లో సంతకం చేసి కార్యాలయ ముద్ర వేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ చలానా ఒకటి పాఠశాలలో, మరొకటి జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో ఏపీసీ దగ్గర, మూడో చలానా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.
  • సప్లయర్స్ ఇచ్చే 1 డెలివరీ చలానాల్లో సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు/ మండల విద్యాశాఖాధికారి సంతకం, వస్తువులు తీసుకున్న తేదీ తప్పక ఉండేలా చూసుకోవాలి.

లాగిన్లలో నమోదు:

  • ‘జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్ల పంపిణీ వివరాలు “జగనన్న విద్యా కానుక’ యాప్ నందు నమోదు చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు సంబంధిత జిల్లాలకు పంపడం జరిగింది. 
  • మండల విద్యాశాఖాధికారులు మరియు స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు ‘జగనన్న విద్యాకానుక’ – యాప్ లో తమకిచ్చిన లాగిన్ నందు అందుకున్న వస్తువుల వివరాలు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా నమోదు చేయాలి.
  • ‘జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్ల పంపిణీ పై జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, జిల్లా సీ యం ఓ లకు, మండల విద్యాశాఖాధికారులు మరియు స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు: 
  • ‘జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్లు జులై 5, 2022 నుండి జులై 30, 2022 వరకు పంపిణీ చేయాలి.
  • ‘జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్ల పంపిణీ పూర్తిగా బయో మెట్రిక్ విధానంలోనే చేయాలి. ఒకవేళ పాఠశాల నందు బయో మెట్రిక్ పరికరాలు పనిచేయని పరిస్తితులలో సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు సంబంధిత పాఠశాలల వివరాలను సేకరించి సంబంధిత జిల్లా కలెక్టర్ వారికి తెలియచేసి గ్రామ / వార్డ్ సచివాలయాల వద్ద ఉన్న బయో మెట్రిక్ పరికరాల ద్వారా స్టూడెంట్ కిట్ల పంపిణి జరిగేలా చర్యలు తీసుకోవాలి.
  • పాఠశాల ప్రధానోపాధ్యాయులు రోజు మరియు తరగతుల వారిగా స్టూడెంట్ కిట్ల పంపిణీ గురించి ముందుగానే విద్యార్ధుల యొక్క తల్లి తండ్రులకు తెలియచేయాలి. 
  • ‘జగనన్న విద్యాకానుక స్టూడెంట్ కిట్ల పంపిణీ వలన పాఠశాల పనితీరు మరియు బోధన కు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.
  • ఒకరోజుకు సుమారుగా 30 నుండి 40 కిట్లు పూర్తి బయో మెట్రిక్ విధానంలో పంపిణీ జరిగేలా చూసుకోవాలి.
  • పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు తప్పనిసరిగా అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి. తరువాత సంబంధిత విద్యార్థులకు కిట్లు అందచేయాలి. ఒకవేళ కొత్త విధ్యార్ధుల ప్రవేశాలు అధికంగా ఉండి, అదనముగా స్టూడెంట్ కిట్లు అవసరమైనప్పుడు
  • పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంబందిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయాలి.
  • పాఠశాల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి సరిపడా సైజు అందేవిధంగా చూసుకోవాలి. ఒకవేళ సరిపడా సైజు లేని పక్షంలో సంబంధిత మండల విద్యాశాఖాధికారి కి తెలియచేసి పక్క మండలాల వద్ద ఉంటే, వారి వద్ద నుండి సేకరించి విద్యార్థికి అందేలా చూసుకోవాలి. 
  • ‘జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్ల నాణ్యత ను విద్యార్ధులకు పంపిణీకి ముందు సరిచూసుకోవాలి. ఒకవేళ పాడైన, చిరిగిన వస్తువులు ఏమైనా గుర్తించినట్లైతే వాటి వివరాలు సంబందిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయచేస్తూ కొత్తవి తిరిగి తీసుకొనేలా చూసుకోవాలి. 
  • పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్ధుల వివరాలను 15.07.2022 లోపు సంబంధిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయచేయాలి. 15.09.2022 లోపు కొత్తగా చేరిన విద్యార్ధులకు కిట్లు అందచేయబడతాయి.
  • ప్రతి జిల్లా నందు జగనన్న విద్యాకానుక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసేలా సమగ్రశిఖ అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటరు చర్యలు తీసుకోవాలి. కంట్రోల్ రూమ్ నందు ప్రతిరోజు సాయత్రం 6.00 గంటల లోపు జిల్లా, మండల మరియు స్కూల్ కాంప్లెక్స్ లకు వచ్చే స్టాక్ వివరాలు, ఏమైనా నాణ్యత గురించి వచ్చే ఫిర్యాధులు, బూట్లు సైజ్ వివరాలు మరియు జిల్లాకు కావలసిన అధనపు కిట్ల వివరాలు నమోదు చేస్తూ రాష్ట్ర కార్యాలయానికి నివేదిక అందించాలి.
  •  ప్రతి జిల్లా లో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాకానుక కంట్రోల్ రూమ్ నందు పని చేయుచున్న సంబంధిత అధికారుల వివరాలు రాష్ట్ర కార్యాలయానికి 01.07.2022 లోపు తెలియచేయాలి. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల నందు కూడా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలి. 
  • మండల కేంద్రాలలో మరియు స్కూల్ కాంప్లెక్స్ లలో తప్పనిసరిగా స్టాక్ రెజిస్టర్స్ ను నిర్వహించవలెను. రాష్ట్ర మరియు జిల్లా అధికారులు సందర్శనకు వచ్చినప్పుడు విధిగా స్టాక్ రిజిస్టర్స్ ను చూపించాలి. 
  • మండల కేంద్రాల నుండి స్కూల్ కాంప్లెక్స్ లకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ల నుండి పాఠశాలలకు జగనన్న విద్యాకానుక కిట్టు తరలించే సమయంలో రవాణా మరియు ఇతర ఖర్చులను స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్స్ నుండి భరించవలెను.
  • జిల్లా కేంద్రం నుండి డిక్షనరీలు మరియు ఇతర జగనన్న విద్యా కానుక కిట్లు తరలించడానికి, ట్రాన్స్ పోర్టర్ ఎంపిక చేయడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా డి. పి. సి ఆమోదం తీసుకొని దానికి అయ్యే ఖర్చును సంబంధిత జిల్లా మ్యానేజ్మెంట్ కాస్ట్ నుండి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. .
రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.
దీనితో పాటు “అనుబంధం-1′ జతపరచడమైనది.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this