Receiving of Rice from FP Shops...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Receiving of Rice from FP Shops Instructions : వేలి ముద్ర వేసి మాత్రమే బియ్యం తీసుకోవాలి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Receiving of Rice from FP Shops Instructions : HM లు వేలి ముద్ర వేసి మాత్రమే బియ్యం తీసుకోవాలి.

Receiving of Rice from FP Shops Instructions

న్యూస్ టోన్, అమరావతి: మధ్యాహ్న భోజన పథకం కోసం బియ్యాన్ని ప్రధానోపాధ్యాయులు/ ఏజెన్సీ వారు వేలి ముద్ర వేసి మాత్రమే తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కొన్ని పాఠశాలలకు బియ్యం కేటాయింపు జరగకపోవడం గమనించారు. దీనికి కారణం ప్రధానోపాధ్యాయులు చౌక ధరల దుకాణం నుండి వేలిముద్ర వేయకుండా మాన్యువల్ గా బియ్యం తీసుకోవడం వలన ఈ ఇబ్బంది తలెత్తుతుందని గమనించారు. బియ్యం తీసుకునే విషయంలో ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నందువలన ప్రధానోపాధ్యాయులు ఎవరు మాన్యువల్ గా బియ్యం తీసుకోకూడదని సూచించారు. న్యూస్ టోన్.in

గతంలో ఇలా ప్రధానోపాధ్యాయులు మాన్యువల్ గా బియ్యం తీసుకోవడం వలన ఇబ్బందులు తలెత్తిన క్రమంలో రెండుసార్లు ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో సరి చేయడం జరిగింది.

ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ వారు బియ్యాన్ని మ్యాన్యువల్ గా తీసుకోవడం వలన బియ్యం లెక్కలు సరిపోకపోవడం మరియు అక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కావున విద్యాశాఖ అధికారులు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు తెలియపరచ వలసిందిగా ఆదేశించారు. న్యూస్ టోన్.in

ప్రధానోపాధ్యాయులు గమనించవలసిన అంశాలు

  • ప్రతి నెల పాఠశాలకు కావలసిన బియ్యం వివరాలను ఐ ఎం ఎం ఎస్ యాప్ లో 15వ తేదీ నుండి 20వ తేదీ మధ్యలో నమోదు చేయవలెను.
  • ప్రధానోపాధ్యాయులు అందరూ విధిగా వేలి ముద్ర వేసి ప్రతి నెలా 1వ తేదీ నుండి 15వ తేదీ లోపు బియ్యం ను తీసుకోవాలి.
  • చౌక ధరల దుకాణం వివరాలు మార్చుకోవాలి అనుకుంటే, బియ్యం తీసుకున్న తర్వాత ప్రతి నెలా 20వ తేదీన మార్పులు చేసుకోవచ్చు. న్యూస్ టోన్.in

ఈ ఆదేశాలను పాటిస్తూ ప్రతి నెలా బియ్యం తీసుకోవాలని, ఈ ఆదేశాలు పాటించని పక్షం లో ప్రధానోపాధ్యాయులను భాధ్యులు చేస్తూ ప్రధానోపాధ్యాయుల పై చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ క్లిక్ చేసి ఉత్తర్వుల కాపీ ని డౌన్లోడ్ చేసుకోండి.

[post_ads]

receiving of rice from fp shops instructions : వేలి ముద్ర వేసి మాత్రమే బియ్యం తీసుకోవాలి

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this