RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా.. ఫ్యాన్స్ రచ్చ ..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

RRR Movie Trailer in Telugu: డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్..

RRR డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్… తారక్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్‏లో ఉన్నాయి. అందుకు తగినట్టుగానే ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన వీడియోస్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు నటిస్తుండడంతో ఈ మూవీని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కానీ సెకండ్‌ వేవ్‌ తర్వాత కరోనా కాస్త గ్యాప్‌ ఇవ్వడంతో జక్కన్న శరవేగంగా చిత్రాన్ని పూర్తి చేశారు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ఈరోజు ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. అయితే కాసేపటి క్రితం ఆర్ఆర్ఆర్ ట్రైలర్‏ను థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన ట్రైలర్‏లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోయాయి. యుద్దాన్ని వెతుకుంటూ ఆయుధాలు అవే వస్తాయి అంటూ వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక రామ్ చరణ్, తారక్ విజువల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. అయితే ఈ ట్రైలర్ సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ అనుహ్యంగా కాసేపటి క్రితమే యూట్యూబ్ లో విడుదల చేశారు.
ఇక ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం అభిమానులు సందడి మొదలుపెట్టేశారు. థియేటర్ల ముందు తారక్, చరణ్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి బాణాసంచాలు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు థియేటర్ల వద్ద అభిమానుల తాకిడి మొదలైంది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కోసం థియేటర్ల వద్దకు భారీగా మెగా, నందమూరి అభిమానులు చేరుకుంటున్నారు. ఇక ట్రైలర్ దృశ్యాలను కొందరు నెటిజన్స్ ట్విట్టర్ ఖాతాలలో షేర్ చేస్తున్నారు.
rrr movie trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా.. ఫ్యాన్స్ రచ్చ ..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this