Premetric Scholorship: ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకానికి...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Premetric Scholorship: ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకానికి రూ. 1,378 కోట్లు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మైనార్టీల విద్యాభివద్ధి కోసం కేంద్రం అందజేస్తున్న ‘ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్’ పథకానికి 2021 22 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రూ.1,378 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. గురువారం లోక్సభలో ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్లో 36.63 లక్షలు మైనారిటీలు ఉన్నారని, ఏపిలో ఏడాదికి మొత్తం 8,03,358 దరఖాస్తులకు గాను కేంద్రం 56,889 స్కాలర్ షిప్లు మాత్రమే ఇచ్చిందని ప్రశ్నించగా మంత్రి ఈ విషయం చెప్పారు. మైనార్టీ కమ్యూనిటీల లోని పిల్లలకు తగిన విద్యావకాశాలను కల్పిం చడం ముఖ్యమైన అంశమని శ్రీకృష్ణదేవ రాయలు అన్నారు. 2018 నుండి 2021 వరకు 1,70,667 స్కాలర్ షిప్ లు మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ పథకం కింద నోటిఫైడ్ అయిన ఆరు మైనారిటీ కమ్యూనిటీ లకు సంబంధించి ఇప్పటివరకు 5,95,679 దరఖాస్తులు ధవీకరించినట్లు మంత్రి తెలిపారు. మరో 4,43,837 స్కాలర్షిప్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. 2020-21 గానూ స్కాలర్షిప్ ల పంపిణీ ఇంకా కొనసాగుతోందని బదులిచ్చారు. రాష్ట్రాలకు వార్షిక నిధుల కేటా యింపు అనేది అందుబాటులో ఉన్న బడ్జెట్, రాష్ట్రంలో మైనారిటీల జనాభాపై ఆధారపడి ఉంటుందన్నారు. స్కాలర్షిప్ కు సంబంధిం చిన అన్ని అంశాలను స్కీమ్ రివిజన్ ప్రక్రియలో మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని తెలిపారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this