Online Attendance: బడుల్లో ఆన్‌లైన్‌ హాజరుకు కష్టాలు!

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Online Attendance: బడుల్లో ఆన్‌లైన్‌ హాజరుకు కష్టాలు!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • సాంకేతిక కారణాలతో నమోదుకే గంటల కొద్దీ సమయం..*

విద్యార్థుల ఆన్‌లైన్‌ హాజరులో తరచూ ఏర్పడుతున్న సమస్యలు.. ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విద్యార్థులకు ‘అమ్మఒడి’ పథక లబ్ధి చేకూరాలంటే నవంబరు 8 నుంచి 75 శాతం హాజరు తప్పనిసరి చేయడంతో ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ నిర్వహణ కీలకంగా మారింది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో 61 వేల పాఠశాలల్లోని 73 లక్షల మంది పిల్లల హాజరు వేయాలంటే సర్వర్‌ మొరాయిస్తోంది. దీనికితోడు సెల్‌ సిగ్నల్స్‌ సరిగా లేకపోవడం, ఈ-హాజరు యాప్‌లో సాంకేతిక సమస్యలు తలనొప్పిగా మారాయి. తీరా హాజరు వేశాక సబ్మిట్‌ చేసేందుకు గంటల కొద్దీ సమయం పడుతోంది. ఒక్క రోజు హాజరు నమోదు చేయకపోయినా ‘అమ్మఒడి’ రాదంటూ గతంలో ప్రైవేటు యాజమాన్యాలను ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఈ పని కోసమే ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయిస్తున్నాయి. రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉన్న ఏకోపాధ్యాయ బడుల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది. వీటిలో మొదట విద్యార్థుల హాజరును రిజిస్టర్‌లో నమోదు చేసుకొని, ఆ తర్వాత యాప్‌లో వేస్తున్నారు. ఏ సమస్యా లేకపోతే ఈ ప్రక్రియ అరగంటలో పూర్తవుతోంది. కానీ ఇటీవల సెక్షన్ల వారీగా నమోదు చేయాల్సి రావడం. దీనికి తోడు సాంకేతిక సమస్యల వల్ల 2 గంటల వరకు సమయం పడుతోంది. యాప్‌లో పిల్లల ఇంటి పేర్లు లేక ఐడీ నంబరు దగ్గర పెట్టుకొని, హాజరు నమోదు చేయాల్సి వస్తోంది.

త్వరలో ఇంటర్‌కు అమలు..

‘అమ్మఒడి’ పథకాన్ని ఇంటర్‌కు అమలు చేస్తున్నందున త్వరలో ఈ విద్యార్థులకూ ఆన్‌లైన్‌ హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అధికారులు విద్యార్థుల డేటాపై కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు తగ్గించేందుకు ప్రాథమిక, ఉన్నత, ఇంటర్‌కు వేర్వేరు సమయాలు కేటాయించాలని ఆలోచిస్తున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this