PRC: పీఆర్సీని వారంలోగా ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

PRC: పీఆర్సీని వారంలోగా తేల్చాలి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అమరావతి, నవంబరు 8 : పీఆర్సీని వారంలోగా తేల్చాలని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్లు చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం అమరావతి సచివాలయంలో సాధారణ పరిపాలనశాఖ సర్వీసెస్‌ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ను కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదికను సీఎంకు బ్రీప్‌ చేసి ఉద్యోగ సంఘాలకు ఇద్దామని అనుకున్నామని, అయితే సీఎం బిజీగా ఉండడం వల్ల బుధవారం ఉదయం సీఎంకు పీఆర్సీ నివేదిక బ్రీఫ్‌ చేసి, అదేరోజు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలకు అందజేస్తామని సీఎస్‌ చెప్పినట్లు శశిభూషణ్‌కుమార్‌ తెలిపారన్నారు. బొప్పరాజు మాట్లాడుతూ.. బుధవారం నివేదిక ఇవ్వని పక్షంలో ఇరు జేఏసీల రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్‌ సమావేశం ఏర్పాటు చేయదలిచామన్నారు. జీపీఎఫ్‌లోన్లు కోట్లాది రూపాయలు, ఏపీజేఎల్‌ఐ లోన్లు, విశ్రాంత ఉద్యోగుల సరెండర్‌ లీవ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి విడుదలకు కార్యాచరణ ప్రకటించాలని, లేనిపక్షంలో ఇరు జేఏసీలు తీవ్రమైన ఆందోళన బాటపట్టేందుకు సిద్ధమవుతామని వెల్లడించారు. ఇక, చంద్రశే ఖర్‌రెడ్డి ప్రభుత్వానికి సలహాదారు కానీ ఉద్యోగ సంఘాలకు కాదని, తమకు సీఎం జగనే బాధ్యత వహించాలని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా బొప్పరాజు తెలిపారు.

వారంలో పీఆర్సీ నివేదిక: వెంకట్రామిరెడ్డి 

ఈ వారంలో పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తెలిపినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. సోమవారం సీఎస్‌ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ ఒడిసా పర్యటన తర్వాత పీఆర్సీ సహా, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో లేవనెత్తిన అంశాలను సీఎంతో చర్చిస్తామని, తర్వాత సీఎం ఆదేశానుసారం నివేదిక వెల్లడిస్తామని సీఎస్‌ చెప్పారన్నారు. అలాగే, ప్రొబేషన్‌పై గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు.. సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మి ఆందోళన చెందవద్దని చెప్పారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this