PRC కదల్లేదు - పీఆర్సీ నివేదిక సమర్పించి...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

PRC కదల్లేదు – పీఆర్సీ నివేదిక సమర్పించి నేటితో ఏడాది పూర్తి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • ఏడాదైనా కదల్లేదు
  • పీఆర్సీ నివేదిక సమర్పించి నేటితో ఏడాది పూర్తి
  • అమలుకు ఇంకా ప్రారంభం కానీ కార్యాచరణ..
  • సీఎస్‌ కమిటీ సిఫార్సులూ అందలేదు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదిక సమర్పించి బుధవారానికి ఏడాది పూర్తయింది. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను అమలు చేయలేదు. నివేదిక ప్రభుత్వానికి అందాక అమలుకు ఇంత జాప్యం ఎప్పుడూ లేదని ఉద్యోగసంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో ఆర్థికశాఖ, సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ కమిటీ ఏర్పాటు నాటికి ఆదిత్యనాథ్‌ దాస్‌ సీఎస్‌గా ఉన్నారు. ఆయన కాలంలో కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించలేదు. పీఆర్సీపై ప్రాథమిక చర్చలే పూర్తయ్యాయని, మంత్రివర్గానికి సిఫార్సులు చేసే అంశం కొత్త సీఎస్‌ చూస్తారని విశ్రాంత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ చెప్పారు. దీంతో పీఆర్సీ అమలుకు ఇంకా సానుకూల పరిస్థితులు ఏర్పడలేదని అర్థమవుతోంది. ఉద్యోగులకు 2019 జులై నుంచి 27% మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇస్తున్నారు. పదకొండో వేతన సవరణ సంఘం 2018 మే 28న ఏర్పాటయింది. ఆరుసార్లు గడువు పెంచాక చివరకు గతేడాది అక్టోబరు 5న కమిషన్‌ నివేదికను సమర్పించింది.

గతంలోనూ ఉద్యోగులకు నష్టమే

ఆంధ్రప్రదేశ్‌లో వేతన సవరణ సంఘాల ఏర్పాటు 1969లో ప్రారంభమయింది. ఇంతవరకు 11 పీఆర్సీలను ఏర్పాటు చేశారు. వీటి సిఫార్సులను ఆలస్యంగా అమలు చేయడంతో నష్టపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. అమలుతేదీ, ఆర్థికలాభాల ప్రారంభానికి మధ్య కాలాన్ని నోషనల్‌ (వాస్తవ అమలు కాకుండా కాగితాల్లో) అని నిర్ణయిస్తున్నారు. ఈసారి అది మరీ ఆలస్యమవుతోంది. దీంతో ఈ మధ్య కాలంలో పదవీవిరమణ చేసే ఉద్యోగులు నష్టపోతున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this