- కొత్త విద్యా విధానంపై చర్చకు నిర్ణయం
Meeting on NEP: జూన్ 15 ఆంధ్రప్రదేశ్ లో కొత్త విద్యా విధానంపై ఉపాధ్యాయ లోకం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారితో మాట్లాడాలని నిర్ణయించింది. రాష్ట్రం లోని అన్ని గుర్తింపు పొందిన, గుర్తింపు లేని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంతకుముందే హామీ ఇచ్చినట్లు సమావేశపు తేదీ ఖరారయింది. జూన్ 17న వెలగపూడి సచివాలయంలో మంత్రి ఛాంబరులో ఈ సమావేశం ఉంటుంది. అందరి అభిప్రాయాలు తెలుసుకుని ముందడుగు వేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆయా సంఘాలకు చెందిన రాష్ట్ర అధ్యక్షుడు, లేదా ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ ప్రతాపరెడ్డి మెమో జారీ చేశారు..
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.