AP PRC Shortly: త్వరలో పీఆర్సీ ఇస్తామని...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP PRC Shortly: త్వరలో పీఆర్సీ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • త్వరలో ఉద్యోగ నాయకులతో సమావేశం
  • జగన్ ను కలిసి వచ్చిన ఎన్ జీ వో నేతల వెల్లడి
  • ప్రాధాన్య క్రమంలో సమస్యలన్నీ పరిష్కారానికి హామీ

PRC Shortly: పీఆర్సీ అమలు, కరవు భత్యం చెల్లింపులు, సీపీఎస్ తో సహా అన్నింటిపై  సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ మరోసారి హామీ ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగ  సంఘ నాయకులతో చర్చించి వీటిపై నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఎన్ జీ వో సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావులు తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎన్ జీ వో సంఘం నాయకులు, రాష్ర్ట కార్యవర్గ నేతలు ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రాధాన్య క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారన్నారు.  ఆ వివరాలను ఎన్ జీ వో నేతలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…

11వ పీఆర్సీని కాలతీతం కాకుండా అమలు చేయాలని కోరాము. 2018 జులై ఒకటి నుంచి 55శాతం ఫిట్మెంట్ తో అమలు చేయాలని డిమాండ్ చేశాం. త్వరలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిచారు.

2018 జులై 1 నుంచి కరవు భత్యం బకాయిలు విడుదల చేయాలని కోరాం.

సి.పి.ఎస్. పై మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  టక్కర్  ఇచ్చిన నివేదికపై మంత్రుల బృందం ఏర్పాటు చేశారని, వారి నివేదికపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని విన్నవించాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అడిగాం. దీనిపైనా ఉద్యోగ నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరాం. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, ఆర్థిక సాయం అందించాలని కోరాం. త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

నాలుగో  తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు  పెంచాలని కోరాం. 

గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నాయకులు, తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఒకే చోట 9 సంవత్సరాలు పనిచేయ వచ్చనే నిబంధనను పునరిద్దరించాలని కోరాం, గతంలోనే అంగీకరించారని ఉత్తర్వులు రాలేదని తెలియజేయగా వెంటనే విడుదల చేసే ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు అందరికి వారు పనిచేసే ప్రాంతాలలో ఇంటి స్థలాలను మంజూరు చేయాలని కోరాం.

కోవిడ్ సోకిన అన్ని శాఖల ఉద్యోగులకు 30 రోజులు స్పెషల్ క్యాజువాల్ లీప్ ను మంజూరు చేయాలని, అలాగే కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన అన్ని శాఖల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం తో పాటు కుటుంబంలో అర్హులు.. అయినవారికి వెంటనే కారుణ్య నియామకాలు  చేపట్టాలని కోరాం. జగన్ సానుకూలంగా స్పందించారు.

కమర్షియల్ టాక్స్ శాఖలో పనిచేసే అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ / గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్ కు త్వరలో గెజిటెడ్ హోదా ఉత్తర్వులు ఇస్తామన్నారు.

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన పెన్షనరీ టెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ,  ఉద్యోగస్తులు కోరిన వెంటనే జి.పి.ఎఫ్. అడ్వాన్సు, ఏ.పి.జి.ఎల్.ఐ లోను తదితర బిల్లులను చెల్లించే లా  చర్యలు తీసుకోవాలని కోరాము. 

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశాం.

1998 డీఎస్సీ వారికి సత్వరమే పోస్టింగులు ఇవ్వాలని కోరాము.

పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులకు టైం స్కేలు ఇవ్వాలి. వేతనం రూ.70 వేలకు మించి పెంచాలని కోరాం

ముఖ్యమంత్రిని కలిసిన బృందంలో  ఎన్ జీ వో సంఘం రాష్ట్ర సహా అధ్యక్షులు సి.హెచ్. పురుషోత్తం నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వి.రమణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి. కృపావరం, కడప జిల్లా అధ్యక్యులు కె.వి. శివారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి సి.హెచ్. శ్రీనివాస్  ఇతర  రాష్ర్ట కార్యవర్గ నాయకులు పాల్గొన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this