Admissions: గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Admissions: గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • 2021-22కి లాటరీ పద్ధతిలో ప్రవేశాలు
  • నేటి నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
  • ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటన

గురుకుల విద్యాలయాల సంస్థలో 5వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. సంస్థ నడుపుతున్న 38 సాధారణ, 12 మైనారిటీ పాఠశాలల్లో(తాడికొండ, గుంటూరు జిల్లా, కొడిగినహళ్లి, అనంతపురం జిల్లాతో సహా)2021-22 విద్యాసంవత్సరానికి గాను ఇంగ్లిష్‌ మీడియంలో అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి ఎం.ఆర్‌. ప్రసన్న కుమార్‌ శనివారం తెలిపారు. విద్యార్థులను జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో జూలై 14న ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ద్వారా పాఠశాల కేటాయిస్తారని తెలిపారు. అర్హులైనవారు ఈ నెల 6(ఆదివారం) నుంచి 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://aprs.apcfss.in చూడాలని కోరారు. 

ప్రవేశానికి అర్హతలు

ఓసీ/బీసీ విద్యార్థులు 01.09.2010 నుంచి 31.08.2012 మధ్య, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 01.09.2008నుంచి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి. సంబంధిత జిల్లాలో 2019-21 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3-4 తరగతులు చదివి ఉండాలి. ఓసీ/బీసీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. గ్రామీణ, పట్టణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు జనరల్‌/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. అభ్యర్థి తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయం (2020-21) రూ.లక్షకు మించరాదు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this