10th, Inter Examinations: పదవ తరగతి, ఇంటర్ పరీక్షలపై వీడని సస్పెన్స్.
సస్పెన్స్ కు తెర ఇంకా పడలేదు…
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం ఏదీ తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ పరీక్షల తేదీలు గురువారం ఖరారవుతాయని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి వద్ద విద్యా విషయాలపై చర్చ జరిగినా పరీక్షల తేదీలపై ఎలాంటి చర్చ జరగలేదని, ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మంత్రి విలేకరులకు వెల్లడించారు. సుప్రీంకోర్టు పరీక్షల విషయంలో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన విషయం ఇంకా తన దృష్టికి రాలేదని, వస్తే సమాధానం పంపిస్తామని అన్నారు. పరీక్షల నిర్వహణ పై తొలి నుంచి ప్రభుత్వ వైఖరి ఒకటే అని చెప్పారు. విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలనేదే తమ అభిప్రాయమని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.