Baal Aadhaar Card: ఐదేళ్ల లోపు పిల్లలకు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Baal Aadhaar Card: ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా ఆధార్ తప్పనిసరి.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో ఎలా అప్లై చేయాలంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 UIDAI: చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డు ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. అయిదేళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ కార్డు కోసం అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

భారత పౌరులందరికీ ఆధార్ కార్డు ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించే మాధ్యమంగా ఆధార్ నంబర్‌ను పరిగణిస్తున్నారు. అందువల్ల ప్రతి భారతీయుడు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసిన 12 అంకెల ఆధార్ కార్డును తీసుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత వివరాలు, చిరునామా వంటి వివరాలను కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యక్తుల బయోమెట్రిక్ లేదా ఐరిస్‌కు ఈ వివరాలను లింక్ చేస్తారు. పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా తప్పకుండా ఆధార్‌ కార్డు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పిల్లల కోసం ఆధార్ కార్డును జారీ చేయడానికి UIDAI ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీరికి ఇచ్చే ఆధార్‌ను బాల ఆధార్ కార్డ్ (Baal Aadhaar Card) అని పిలుస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా బాల ఆధార్‌ కార్డులను అందిస్తున్నారు అధికారులు.
పిల్లలకు ఆధార్ నమోదు ప్రక్రియ పెద్దల మాదిరిగానే ఉంటుంది. తల్లిదండ్రులు దగ్గర్లో ఉన్న నమోదు కేంద్రానికి వెళ్లి అవసరమైన వివరాలతో ఫారమ్ నింపాలి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి బయోమెట్రిక్ డేటాను నమోదు చేయరు. కానీ వారి వయసు ఐదేళ్లు, 15 ఏళ్లకు చేరుకున్నప్పుడు అన్ని ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకు ఆధార్ కార్డును ఉచితంగా ఇవ్వాలనే నియమం ఉంది.

పిల్లలకు ఆధార్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

పిల్లల ఆధార్‌ కోసం ముందు UIDAI అధికారిక వెబ్‌సైట్‌ (https://uidai.gov.in/)కు వెళ్లి, ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. పిల్లల పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్.. వంటి వివరాలను ఇక్కడ నమోదు చేయాలి. పూర్తి వివరాలతో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ ఫారమ్‌ను నింపాలి. అనంతరం అపాయింట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసి, ఆధార్ కార్డు కోసం రిజిస్ట్రేషన్ తేదీని ఎంపిక చేసుకోవాలి. దగ్గర్లో ఉండే ఆధార్ కేంద్రాన్నితల్లిదండ్రులు ఎంచుకోవచ్చు. రిజిస్ట్రేషన్ బుకింగ్ తేదీన.. పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఫోటో కాపీలు, అన్ని పత్రాలతో నమోదు కేంద్రానికి వెళ్లాలి.
ఆధార్ అధికారి అన్ని పత్రాలను సరిచూస్తారు. పిల్లలకు ఐదేళ్ల లోపు వయసు ఉంటే, కేవలం వారి ఫోటో మాత్రమే ఆధార్‌ కార్డు కోసం తీసుకుంటారు. వీరి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయరు. ఐదేళ్ల కంటే ఎక్కువ వయసు ఉంటేనే పిల్లల బయోమెట్రిక్ వివరాలను నమోదు చేస్తారు. అన్ని వివరాలను ధ్రువీకరించిన తరువాత దరఖాస్తుదారునికి ఒక ఎకనాలెడ్జ్‌మెంట్ నంబర్‌ ఇస్తారు. దీని ద్వారా అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. నమోదు చేసుకున్న 60 రోజుల్లో దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత 90 రోజుల్లో బాల ఆధార్ కార్డును పంపిస్తారు.

బాల ఆధార్ కార్డు కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలి?

దరఖాస్తుదారులు దగ్గర్లో ఉన్న ఆధార్ కార్డు నమోదు కేంద్రానికి వెళ్లాలి. పిల్లల ఆధార్ కార్డు నమోదుకు సంబంధించిన ఫారాన్ని నింపాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జతచేసి అధికారులకు దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలి. తల్లిదండ్రుల ఆధార్ కార్డు వివరాలు, మొబైల్ నంబర్ వంటి వివరాలను కూడా ఫారంలో తప్పనిసరిగా నింపాలి.
దీని వెరిఫికేషన్ పూర్తయిన తరువాత పిల్లలను ఫోటో తీస్తారు. ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్నవారి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయరు. ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉంటే, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు, ఇతర బయోమెట్రిక్ డేటాను సేకరిస్తారు. అన్ని వివరాలను ధ్రువీకరించిన తరువాత ఒక రసీదు ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, 60 రోజుల్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ ఎస్ఎంఎస్ వచ్చిన 60 రోజుల్లో బాల ఆధార్ కార్డు జారీ చేస్తారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this