May1, 2021 New Rules: అలర్ట్‌.. రేపటి...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

May1, 2021 New Rules: అలర్ట్‌.. రేపటి నుంచి ఈ ఐదు అంశాల్లో మార్పులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

May1, 2021 New Rules: ఏప్రిల్‌ నెల ముగిసింది. రేపటి నుంచి మే నెల ప్రారంభం కానుంది. మే 1 నుంచి పలు అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు గ్యాస్‌ సిలిండర్‌ నుంచి ప్రారంభిస్తే బ్యాంకింగ్‌, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలను ప్రభావితం చేయనున్నాయి.

వ్యాక్సినేషన్ :

ఇక దేశంలో మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ రేపటి నుంచి వ్యాక్సిన్‌ అందించనున్నారు. ఇందు కోసం ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

గ్యాస్‌ సిలిండర్‌ :

గ్యాస్‌ సిలిండర్‌ ధర వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.861 ఉంది. అయితే ప్రతీనెల 1వ తేదీన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సిలిండర్‌ ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే మే 1న గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మారే అవకాశం ఉంది. మరి రేపటి నుంచి గ్యాస్‌ కంపెనీలు సిలిండర్‌ ధరలను పెంచి కస్టమర్లకు షాకిస్తాయా..? లేక తగ్గిస్తాయా అనే విషయం రేపు తేలనుంది.

యాక్సిస్‌ బ్యాంక్‌ :

యాక్సిస్‌ బ్యాంక్‌ తన కస్టమర్లకు మే 1 నుంచి షాక్‌ ఇవ్వనుంది. మినిమమ్‌ బ్యాలెన్స్‌ లిమిట్‌ను పెంచుతూ ఇటీవల బ్యాంకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటే ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలను కూడా పెంచింది. ఉచిత నగదును విత్‌డ్రా చేసుకుంటే కస్టమర్లకు అధిక ఛార్జీలను విధించనుంది. ఈ నిబంధనలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ఇన్సూరెన్స్‌ పాలసీ కవరేజ్‌:

ఇన్సూరెన్స్‌ రెగ్యులేటర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య సంజీవని పాలసీ కవరేజ్‌ను రెట్టింపు చేయాలని ఇన్సూరెన్స్‌ కంపెనీలను ఆదేశించింది. మే 1 నుంచి రూ.10 లక్షల వరకు కవరేజ్‌ లభించనుంది.

బ్యాంకులకు సెలవులు:

ఇంకా బ్యాంకులకు సైతం ఈ మే నెలలో భారీగా సెలవులు రానున్నాయి. దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాలను బట్టి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి. అయితే బ్యాంకు ఖాతాదారులను బ్యాంకు సెలవులను గమనించి పనులు చేసుకునేందుకు ప్లాన్‌ చేసుకోవడం మంచిది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this