PAN-Aadhaar Linking: పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయలేదా?...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

PAN-Aadhaar Linking: పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయలేదా? షాకింగ్ న్యూస్ మీకోసమే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

PAN-Aadhaar Linking:
పాన్ కార్డ్-ఆధార్ కార్డ్‌ని ఇంకా లింక్ చేయలేదా? అయితే మీకు భవిష్యత్‌లో
ఇబ్బందు తప్పవు. అవును.. ప్రభుత్వం ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ వస్తోంది.
పాన్-ఆధార్ కార్డు తప్పనిసరిగా లింక్ చేయాలని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం
చేసింది. అలాగే గడువు కూడా పెంచుతూ వస్తోంది. ఈ దఫా పాన్-ఆధార్ కార్డ్
లింక్ చేయనట్లయితే చిక్కులు తప్పవని ప్రభుత్వ వర్గాలు ఖరాకండిగా
హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే అనేకసార్లు గడువు పెంచిన కేంద్రం.. ఈ సారి
జూన్ 30, 2021 నాటికి ఆధార్ కార్డును పాన్ కోర్డుతో అనుసంధానం చేసుకోవాలని
స్పష్టం చేసింది. గడువు లోపు లింకప్ చేసుకోకపోతే.. సదరు వ్యక్తులకు రూ.1000
జరిమానా విధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు..
పాన్ కార్డు కూడా రద్దు అవుతుందంటున్నారు.

వాస్తవానికి మార్చి 31, 2021 లోగా పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని ఆదాయపు
పన్ను శాఖ దేశ ప్రజలకు సూచించింది. అయితే కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి
చెందుతుండటం, దాని దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని ఆ గడువును కాస్తా
ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీని మళ్లీ
జూన్ 30, 2021 వకు పొడిగిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఇదే విషయాన్ని
ఆదాయపు పన్ను విభాగం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఆదాయపు పన్నుచ ట్టం సెక్షన్ 139AA 1961 ప్రకారం జూన్ 30వ తేదీలోపు అందరూ
ఆధార్‌తో పాన్ కార్డ్‌ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని స్పష్టం చేసింది

కాగా, మీరు మీ పాన్‌ కార్డ్, ఆధార్ కార్డును లింక్ చేయాలనుకుంటే.. ఈ లింక్‌ (https://www.incometaxindiaefiling.gov.in/home)పై
క్లిక్ చేసి ఆధార్-పాన్ లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పాన్ కార్డ్-ఆధార్
కార్డుతో అనుసంధానం చేసినట్లయితే ఆ విషయం కూడా అందులో చూపిస్తుంది. ఫోన్
ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా పాన్-ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చు. 567678 లేదా
56161 కు మెసేజ్ పంపి ఆధార్-పాన్ కార్డులను లింక్ చేసుకోవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this