Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? బంపర్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? బంపర్ ఆఫర్ మీకోసమే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Kotak Mahindra Bank:
హౌస్‌ లోన్‌ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త.
కోటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్‌ లోన్స్‌కు సంబంధించి బంపర్ ఆఫర్
ప్రకటించింది. ఆర్‌బీఐ విధానాల నేపథ్యంలో దాదాపు అన్ని బ్యాంకులు హోమ్
లోన్స్‌పై ఇచ్చే వడ్డీ రేట్లను భారీగా పెంచగా.. కోటక్ మహీంద్రా బ్యాంకు అలా
చేయలేదు. వడ్డీ రేట్‌ను స్థిరంగా ఉంచింది. దాంతో దేశంలో అన్ని బ్యాంకుల్లో
కెల్లా కోటక్ బ్యాంక్‌లో మాత్రమే అత్యల్ప వడ్డీ రేటుకు హోమ్ లోన్స్
లభిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ రేట్లను 6.70
శాతం నుంచి 6.95 శాతానికి పెంచగా.. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ మాత్రం
6.65 వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ వడ్డీ రేట్లు అన్ని మొత్తాల
రుణాలకు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. కాగా, తాజా కస్టమర్లతో పాటు
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్లు కూడా రెండు సంవత్సరాల కాలపరిమితితో సంవత్సరానికి
6.65 వడ్డీ రేట్లకు హోమ్ లోన్స్ పొందే అవకాశం ఉంది. అయితే, అయితే
రుణగ్రహీతల క్రెడిట్ స్కోరు, ఎల్‌టివి రేషియో ఆధారంగా వడ్డీ రేట్లు ఉంటాయని
కోటాక్ మహీంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది.

దీనిపై కోటక్ మహీంద్రా బ్యాంక్ కన్స్యూమర్స్ విభాగం అధిపతి అంబూజ్
చంద్‌నా మాట్లాడుతూ.. “కొంతకాలంగా గృహ విక్రయాల్లో పురోగతి కనిపిస్తోంది.
దానికి కారణం వడ్డీ రేట్లలో మార్పులే. స్థిరమైన వడ్డీ రేట్లు వినియోగదారులు
తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. కోటక్
బ్యాంక్.. ఇళ్లు కొనాలనుకునే వారికి అండగా ఉంటుంది. మా కస్టమర్లకు మేం
భరోసా ఇవ్వాలనుకుంటున్నాం. కోటక్ బ్యాంక్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.65%
మారబోదు. నాణ్యమైన ఇంటి నిర్మాణానికి ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నాం.’’
అని చెప్పుకొచ్చారు.

కోటక్ బ్యాంక్ హోమ్‌ లోన్స్ ప్రత్యేకతలు..:
గృహ రుణాలు, బ్యాలెన్స్ బదిలీ రుణాలపై వడ్డీ 6.65% నుండి ప్రారంభమవుతుంది.
6.65% వడ్డీ రేటు అన్ని రుణ మొత్తాలకు వర్తిస్తుంది.
శాలరీ, స్వయం ఉపాధి పొందే కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తోంది.
కోటక్ డిజి హోమ్‌ లోన్స్‌ పేరుతో తక్షణమే రుణాలను మంజూరు చేస్తోంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?..
హోమ్ లోన్స్ కావాలనుకునే వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
కస్టమర్లు కోటక్ బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్లి హోమ్‌ లోన్ కోసం ఆన్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలోని కోటక్ బ్యాంక్‌కు
సంబంధించిన ఏ ఇతర శాఖల్లో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మొబైల్
బ్యాంకింగ్ యాప్, నెట్ బ్యాంకిగ్ ద్వారా కూడా హోమ్ లోన్‌ కోసం అప్లై
చేసుకోవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this