Natural Ripe:మామిడి పండ్లు సహజంగా పండినవా..! కృత్రిమంగా...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Natural Ripe:మామిడి పండ్లు సహజంగా పండినవా..! కృత్రిమంగా పండించారా..! ఎలా గుర్తించాలో తెలుసుకోండి..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

How to know if Mango is Naturally Ripe : వేసవి వచ్చిందంటే చాలు మామిడి
సందడి మొదలవుతుంది.. ధనిక, పేద తేడా లేకుండా అందరు తినే పండ్లు మామిడి.
నగరంలో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తూ ఉంటాయి. అయితే పసుపు రంగులో కనిపించే
సరికి అందరికి నోరూరుతుంది. కానీ అవే ఇప్పుడు అనారోగ్యానికి
కారణమవుతున్నాయి. ఎందుకంటే వాటిని కృత్రిమంగా పండిస్తున్నారు. అందుకే
మామిడి పండ్లను కొనేటప్పడు అవి ఎలా పండించారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఒక్కసారి ఆ విషయాలపై ఓ లుక్కేద్దాం. సాధారణంగా పండ్లన్నీ వాటిలో జరిగే
రసాయనిక చర్యల కారణంగానే మగ్గుతాయి. అవి పండటానికి దోహదం చేసేది ఇథిలీన్.
కాయలు పక్వానికి వచ్చిన తర్వాత వాటిలో సహజంగా ఉండే ఈ రసాయనం వల్ల అవి
వాటంతట అవే పండుతాయి. కానీ వ్యాపారులు మాత్రం అవి తొందరగా పక్వానికి
రావడానికి రసాయనాలు వాడుతారు. అవి బాగా పండినట్లుగా తయారవ్వడానికి
క్యాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే మార్కెట్‌లో క్యాల్షియం
కార్బైడ్ ఉపయోగించిన వాటితో పాటు సహజసిద్ధంగా పండించినవీ అమ్ముతారు వాటిని ఈ
విధంగా గుర్తించాలి.

1. రంగుని బట్టి..

కృత్రిమంగా పండిన వాటిని గుర్తించడానికి పరిశీలించాల్సిన అంశాల్లో మొదటిది
మామిడి పండు రంగు. మగ్గబెట్టిన మామిడిపండ్లు చూడటానికి పసుపు రంగులోనే
ఉన్నా.. వాటిపై ఆకుపచ్చని రంగులో మచ్చలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి.
సహజసిద్ధంగా పక్వానికి వచ్చిన పండైతే దాని రంగు అంతా ఒకే విధంగా ఉంటుంది.

2.వాసన ఆధారంగా..

సాధారణంగా సహజమైన రీతిలో పండిన మామిడి నుంచి వచ్చే వాసన మధురంగా
అనిపిస్తుంది. కానీ కార్బైడ్ ఉపయోగించి పండబెట్టిన మామిడపండ్ల నుంచి ఘాటైన
వాసన వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాటి నుంచి ఎలాంటి వాసన రాకపోవడం
కూడా మనం గమనించవచ్చు.

3. రుచి కూడా చెబుతుంది..

సాధారణంగా కృత్రిమంగా మగ్గబెట్టిన పండును తింటున్నప్పుడు నోటిలో, గొంతులో
మంట పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటివి తిన్న కొంత సమయం తర్వాత
కొందరిలో కడుపునొప్పి, డయేరియా వంటివి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదే
సహజసిద్ధమైనది అయితే.. ఇలాంటి లక్షణాలేవీ కనిపించవు. పైగా రుచి కూడా
అద్భుతంగా ఉంటుంది.

4.గుజ్జునూ పరిశీలించాల్సిందే..

సహజసిద్ధమైన రీతిలో పండిన మామిడి పండ్ల గుజ్జు కాస్త ఎరుపు కలిసిన పసుపు
రంగులో ఉంటుంది. పైగా గుజ్జంతా ఒకే విధంగా కనిపిస్తుంది. అదే కృత్రిమంగా
మగ్గిన పండైతే.. గుజ్జు లేత లేదా ముదురు పసుపు రంగులో ఉంటుంది. ఇది పండు
పూర్తిగా తయారవ్వలేదనడానికి నిదర్శనం.

5.రసం ఎక్కువా? తక్కువా?

మీరు మామిడి జ్యూస్ తీస్తున్నప్పుడు రసం చాలా తక్కువ మోతాదులో వచ్చిందా?
అయితే అది కృత్రిమంగా మగ్గబెట్టిన పండే. పూర్తిగా పక్వానికి వచ్చి
సహజసిద్ధమైన రీతిలో మగ్గిన మామిడి పండులో రసం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా
తియ్యగా కూడా ఉంటుంది.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this