Danger Bells in India: ఇండియాలో పరిస్థితి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Danger Bells in India: ఇండియాలో పరిస్థితి దారుణం, సాయం చేయండి.. క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ అభ్యర్థన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Danger Bells in India:సెకండ్ వేవ్ కోవిడ్ కారణంగా ఇండియాలో పరిస్థితి దారుణంగా ఉందని క్లైమేట్
యాక్టివిస్ట్ గ్రెటా థన్ బెర్గ్ పేర్కొంది. ఈ విపత్కర సమయంలో ఇండియాకు
సాయపడాలని ఆమె పప్రపంచ దేశాలను కోరింది. దేశంలో ఆక్సిజన్, హాస్పిటల్స్ లో
బెడ్స్ కొరత తీవ్రంగా ఏర్పడిందని, అనేకమంది రోగులు మరణిస్తున్నారని ఆమె
ట్వీట్ చేసింది. గ్లోబల్ కమ్యూనిటీ వెంటనే స్పందించి ఇండియాను ఆదుకునేందుకు
ముందుకు రావాలని గ్రెటా థన్ బెర్గ్ అభ్యర్థించింది. ఇండియాలో ఎన్నడూ
లేనివిధంగా కోవిడ్ కేసులు 3.46 లక్షలకు చేరుకోవడం, 24  గంటల్లో 2,624 మంది
మృతి చెందడంతో ప్రపంచ దేశాలు కూడా షాక్ తిన్నాయి. కేసుల ఉధృతి ఇంత తీవ్రంగా
ఉండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.  దీంతో ఫ్రాన్స్, జర్మనీ,
పాకిస్థాన్, యూకే వంటి అనేక దేశాలు ఇండియాపట్ల సంఘీభావాన్ని ప్రకటించాయి.
ఇండియా కోరితే సాయపడడానికి సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్
జాన్సన్ ప్రకటించారు. సింగపూర్, జర్మనీ వంటి దేశాలు  ఆక్సిజన్  తో కూడిన
క్రయోజెనిక్ ప్లాంట్లను పంపడానికి సంసిద్ధతను ప్రకటించాయి,. అయితే ఇదే
సమయంలో ఇండియా నాఒంచి వచ్చే విమాన ప్రయాణికుల పట్ల పలు దేశాలు ఆంక్షలు
విధించాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు  భారత విమానాల సంఖ్యను
కుదించాయి.

అటు మే 15 వరకు దేశంలో కోవిడ్  పరిస్థితి ఇలాగే ఉండవచ్చునని
భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వెంటనే యుధ్ధ ప్రాతిపదికన
చేపట్టాలని, రోజుకు కొన్ని లక్షలమందికైనా వ్యాక్సినేషన్ చేస్తే పరిస్థితి
కొంత మెరుగు పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కాగా-బెంగుళూరులో
ఒకే రోజు 17 వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో 30
వేలకు పైగా కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  ఇతర
రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this