Corona Virus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Corona Virus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Tedros Adhanom: భారత్‌లో పెరుగుతున్న కరోనా సెకండ్‌ వేవ్‌ పట్ల ప్రపంచ
ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ ఎంత తీవ్రంగా ఉంటుందో
సెకండ్‌ వేవ్‌ గుర్తు చేస్తుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్ అథనామ్
అన్నారు. జెనీవాలో జరిగిన వర్చువల్‌ బ్రీఫింగ్‌ సందర్భంగా ఆక్సిజన్‌ కొరత,
ఆస్పత్రుల్లో బెడ్స్‌ కొరత, రమ్‌డెసివిర్‌ వంటి ప్రధాన అత్యవసర ఔషధాల కొరత
కారణంగా భారత్‌లో ప్రతి రోజు రోజు పరిస్థితి చేతులెత్తేస్తున్నట్లు
కనిపిస్తోందని ఆయన అన్నారు.

25 నుంచి 59 ఏళ్ల మధ్య వయసులో ఇన్‌ఫెక్షన్‌ వేగంగా పెరిగిపోతోందని ఆయన
చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా మరింత వేగంగా టీకాలు వేయడం ఎంతో అవసరమని ఆయన
అభిప్రాయపడ్డారు. ఆగ్నేయాసియాలో ఇన్‌ఫెక్షన్‌ మరణాల సంఖ్యను తగ్గించేలా
చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరో వైపు అనేక దేశాల్లో ఉన్న భారతీయ
మిషన్లు అక్కడ ప్రభుత్వాలు, సంస్థలతో ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌
ఇంజెక్షన్‌తో పాటు ఇతర ఔషధాల కోసం చర్చలు జరుపుతున్నాయి. యూఏఈ, సింగపూర్‌,
మరికొన్ని ఆగ్నేయాసియా దేశాల నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు చర్యలు
తీసుకుంటున్నారు. రష్యా కూడా ఆక్సిజన్‌ సరఫరాకు సహాయం చేయడానికి
ముందుకొచ్చింది.

అలాగే భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో
పెరుగుతున్న కేసుల పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. పొరుగు
దేశం పాక్‌ కూడా తాజాగా సంఘీభావం ప్రకటించింది. భారత్‌ నుంచి వచ్చే
ప్రయాణికులను అనుమతించమని ఇప్పటికే పలు దేశాలు ప్రకటించాయి. భారత్‌లో కరోనా
పరిస్థితులపై అంతర్జాతీయ మీడియా కూడా జోరుగా కథనాలు ప్రచురిస్తోంది.
వాషింగ్టన్‌ పోస్టు, న్యూయార్క్‌ టైమ్స్‌, ఏబీసీ వంటి సంస్థలు భారత్‌లోని
పరిస్థితులపై పలు వార్తలు ప్రచురించాయి. భారత్‌లో కరోనా వ్యాప్తికి గల
కారణాలపై విశ్లేషిస్తున్నాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this