Friday, February 20, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Covid-19 WHO: కరోనాపై సోషల్‌ మీడియాలో ప్రచారాలు.....

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Covid-19 WHO: కరోనాపై సోషల్‌ మీడియాలో ప్రచారాలు.. వాస్తవాలపై క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Covid-19 WHO: ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. అయితే గతంలో వచ్చినట్లు ఈ సెకండ్‌వేవ్‌ కరోనాపై రకరకాల ప్రచారాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇలా సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లపై కొందరికి అవగాహన వచ్చినా.. కొందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు, దోమలు, ఈగల ద్వారా కరోనా సోకుతుందని రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈగలు, దోమలు, నీళ్ల ద్వారా కరోనా సోకే అవకాశమే లేదని తేల్చి చెబుతోంది డబ్ల్యూహెచ్‌వో. వాటి ద్వారా వైరస్‌ వ్యాపించవచ్చనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇక కొందరు తెలిసీ తెలియకుండా వాటిని షేర్‌ చేసేస్తున్నారు. మనిషి ప్రతి నిత్యం ఉపయోగించే వాటితో కరోనా సోకుతుందని వస్తున్న పుకార్ల వల్ల భయాందోళనలు కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రచారాల్లో వాస్తవమెంత? ఏది సరైనదనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టత ఇచ్చింది.

వ్యాయామం చేసేటప్పుడు మాస్క్‌ ధరించడం అవసరమా..?

వ్యాయామం చేసే సమయంలో మాస్కులు పెట్టుకోవడం వల్ల శ్వాస సక్రమంగా తీసుకోలేరు. ఆ సమయంలో వచ్చే చెమట మాస్కులను తడిగా చేసి శ్వాసించే ప్రక్రియకు ఇబ్బందులు కలుగజేస్తుంది. దీంతోపాటు సూక్ష్మ జీవులు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో మాస్కులు తీసి ఒక మీటర్‌ భౌతిక దూరం పాటించడం మేలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.

అలాగే ఈత కొడితే కూడా కరోనా వస్తుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈత కొట్టే సమయంలో నీటి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించదు. కేవలం వైరస్‌ ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తికి వైరస్ సోకే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చింది.

వేడినీటితో స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుందా..?

వేడినీటితో స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుందా..? దానిపై కూడా స్పష్టత ఇచ్చింది డబ్ల్యూహెచ్‌వో. వేడి నీళ్లతో స్నానం చేసినంత మాత్రన కోవిడ్‌ రాదనే కరెక్ట్‌ కాదు. బాగా వేడి ఉన్న నీళ్లతో స్నానం చేయడం మంచిది కాదని చెబుతోంది. ఇక ఈగలు, దోమల ద్వారా వైరస్‌ సంక్రమిస్తుందనే పుకార్లు వినిపిన్నాయి. దీనిపై కూడా సమాధానం ఇచ్చింది డబ్ల్యూహెచ్‌వో. ఈగలు, దోమల ద్వారా కరోనా వైరస్‌ సంక్రమిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరుల శరీరాల్లో వైరస్‌ వెళ్తుందని పేర్కొంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this