Antibodies In Kid: అప్పుడే పుట్టిన చిన్నారిలో...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Antibodies In Kid: అప్పుడే పుట్టిన చిన్నారిలో కరోనా యాంటీ బాడీస్‌ను గుర్తించిన వైద్యులు.. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Covid 19 Antibodies In Just Born Baby: యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన
కరోనా మహమ్మారి యావత్‌ మానవాళికి ఎన్నో కొత్త విషయాలను నేర్పించింది.
ఆరోగ్యం నుంచి జీవనశైలి వరకు అన్నింటిలో మార్పులకు కారణమైందీ కంటికి
కనిపించని వైరస్‌. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన ప్రారంభంలో ఎన్నో
అనుమానాలు వ్యక్తమయ్యాయి. గర్భవతిగా ఉన్న మహిళ జన్మనిచ్చే బిడ్డకు కరోనా
వస్తుందా.? ఆ తల్లి బిడ్డకు పాలివ్వొచ్చా లాంటి అంశాలు చర్చకు దారి తీశాయి.

ఇదిలా ఉంటే తాజాగా కోవిడ్‌19ను అంతమొందించేందుకు గాను వ్యాక్సిన్‌
అంఉబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా
వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతమవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో
చోటు చేసుకున్న ఓ సంఘటన వైద్యులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
గర్భవతిగా ఉన్న ఓ మహిళ కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ తీసుకుంది. దీంతో ఆ తల్లికి
జన్మించిన చిన్నారి శరీరంలో పుట్టుకతోనే యాంటీ బాడీలు ఉన్నట్లు వైద్యులు
గుర్తించారు. ఆ మహిళ ఫ్లోరిడాలోలో హెల్త్‌ వర్కర్‌గా పనిచేస్తోంది. ఈ
క్రమంలోనే మోడెర్నా వ్యాక్సిన్‌ను సదరు మహిళలకు బిడ్డకు జన్మనిచ్చే మూడు
వారాల ముందు ఇచ్చారు. ఆ సమయానికి ఆమె 36 వారాల గర్భిణి. ఇక గత జనవరిలో
జన్మించిన ఈ చిన్నారి రక్తాన్ని పరిశీలించగా యాంటీబాడీలు ఉన్నట్లు
గుర్తించారు. ఇలా అప్పుడే పుట్టిన చిన్నారిలో యాంటీ బాడీలు గుర్తించడం
ప్రపంచంలో ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు. ఈ యాంటీబాడీలు చివరి మూడు
నెలల్లో చిన్నారిలోకి ప్రవేశించాయని చెబుతున్నారు. అయితే, ఈ కొవిడ్ యాంటీ బాడీలు శిశువుకు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయన్నది తదుపరి అధ్యయనాల్లో తేలాల్సి ఉందని మరో వైద్యులు‌ తెలిపారు. ఇక 2003లో వచ్చిన సార్స్‌ మహమ్మారి విషయంలో కూడా ఇలాగే జరిగే అవకాశాలున్నాయనేది పరిశోధకుల అంచనా.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this