వేకెన్సీలున్నా కనపడవు!

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

వేకెన్సీలున్నా కనపడవు!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  • 1500 పైగా బదిలీ స్థానాలు బ్లాక్‌ చేయడంపై టీచర్ల ధ్వజం

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 5: మూడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత నిర్వహిస్తోన్న టీచర్ల సాధారణ బదిలీలకు జిల్లాలో పెద్ద సంఖ్యలో వేకెన్సీ లను బ్లాక్‌ చేయడంపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లు ఇకనైనా మంచి స్థానానికి బదిలీ కోరుకోవచ్చునన్న ఆశలపై విద్యాశాఖ నిర్ణయాలు నీళ్ళు చల్లాయి. అందుబాటులో ఉన్న అన్ని వేకెన్సీలను బదిలీ కౌన్సెలింగ్‌కు చేర్చకుండా ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల వల్ల ఉపాధ్యా యులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో అన్ని కేడర్లు, సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 4084 వేకెన్సీలు ఉండగా, ప్రస్తుత బదిలీ కౌన్సెలింగ్‌లో వీటన్నింటిని ప్రదర్శించకుండా కేవలం 2537 వెకెన్సీలను మాత్రమే చూపడం పట్ల టీచర్లలో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. 

ఎస్‌జీటీ కేడర్‌లో ఏకంగా 1199  వేకెన్సీలు బ్లాక్‌

ఒకే స్కూలులో 8 సంవత్సరాలు పనిచేసిన టీచర్లందరినీ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాలో స్కూలు అసిస్టెంట్‌, ఎస్‌జీటీ, కేడర్లలో మొత్తం 1936 మంది టీచర్లు కంపలసరీ ట్రాన్స్‌ఫర్‌ ఉంది. ఇక మొత్తం 4084 వేకెన్సీలు జిల్లాలో ఉండగా వీటిలో సాధారణ బదిలీ కౌన్సెలింగ్‌కు కేవలం 2537 వెకెన్సీలు మాత్రమే చూపించి మిగతా 1547 వెకెన్సీలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్లాక్‌ చేశారు. ఇలా బ్లాక్‌ చేసిన వేకెన్సీల్లో 1199 ఎస్‌జీటీ క్యాడర్‌ నుంచే ఉండడం గమనార్హం. ఎస్‌జీటీ కేటగిరిలో 1936 మంది తప్పనిసరి బదిలీ కావాల్సి ఉండగా 2555 వెకె న్సీలు (ప్లెయిన్‌ ఏరియాలో) అందుబాటులో ఉంటే వాటిలో 1356 వెకెన్సీలను మాత్రమే ప్రదర్శించారు. 

సిఫార్సు బదిలీల కోసమేనా ?

పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న రోడ్డు పక్క న ఉండే పాఠశాలల్లోని వెకెన్సీలనే బ్లాక్‌ చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలా బ్లాక్‌ చేసిన స్థానాలను రాజకీయ సిఫార్సులకు భర్తీ చేయ డానికి ఉద్దేశించినవేనని విమర్శించాయి. కాగా జిల్లా విద్యాశాఖ వర్గాలు మాత్రం టీచర్ల వాదనను ఖండి స్తున్నాయి. మారుమూల ప్రాంత పాఠశాలల్లోని వెకెన్సీ లు కూడా భర్తీ అయ్యేందుకే ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు బ్లాక్‌ చేసినట్లు వివరించాయి. దీని వల్ల అన్ని పాఠశాలలకు టీచర్లు సమన్యాయంగా అందు బాటులో ఉంటారని చెబుతున్నాయి. 

VACANCIES BLOCKED TEACHERS SHOCKED


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this