డీఏ పెంపు

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

డీఏ పెంపు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  • ప్రభుత్వోద్యోగులకు పెన్షనర్లకు తీపికబురు
  • జీతాలు, పెన్షన్, డీఏ బకాయిలచెల్లింపు
  • కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం

అమరావతి, న్యూస్ టోన్: ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లకు కరవు బత్యం (డీఏ) పెంపుపై మంత్రిమం డలి ఆమోదముద్ర వేసింది, శుక్రవారం ముఖ్యమం త్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దశలవారీ చెల్లింపుపై చర్చించిన అనంరం షెడ్యూల్ ప్రకటించారు, 2018 జూలై నుంచి నిలిచిపోయిన డీఏ చెల్లించాలని నిర్ణయించారు. మొత్తం 80 నెలలకు రూ. 3017.4 కోట్లు కాగా ఉద్యోగులకు రూ.2వేల 136.9 కోట్లు పెన్షనర్లకు రూ.880.5 కోట్లు 3.144 శాతం పెంపుతో చెల్లించేందుకు మంత్రిమండలి సుముఖత వ్యక్తం చేసింది. ఇవికాక ఏడాదికి రూ.858.47 కోట్లు ఉద్యోగులకు, 1208.96 లక్షలు పెన్షనర్లకు చెల్లిస్తారు. వీటిని వచ్చే ఏడాది జనవరి 21 నుంచి జీతాలతో కలిపి చెల్లించాలని నిర్ణయించారు. కాగా రెండోవిడత డీఏ (2019 జనవరి) 30 నెలల కాలపరిమితితో 3017.4 కోట్లు చెల్లింపులు జరుగుతాయి. మూడవ విడత (2019 జూలై) డీఏ బకాయిని 5.24 శాతం పెంచుతూ రూ, 5028.90 కోట్లు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏడాదికి ఉద్యోగులకు 1424.84 కోట్లు, పెన్షనర్లకు రూ.589.92 కోట్లు వెరసి 2011.56 కోట్లు ప్రతినెలా చెల్లించాలని నిర్ణయించారు. ఇదికాక కరోనా లాక్ డౌన్ సమయంలో ఆలిండియా సర్వీసెస్ అధికారులకు 80 శాతం, ప్రజాప్రతినిధులకు నూరుశాతం, ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 10 శాతం మార్చి, ఏప్రిల్ నెలజీతాల్లో విధించిన కోతను కూడా చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకు రూ. 2824 కోట్లు, పెన్షనర్లకు రూ. 422 కోట్లు వచ్చే నెల జీతంతో పాటు జనవరి 2021 జీతాలు, పెన్షన్లతో కలిపి చెల్లించేందుకు సమావేశం సుముఖత వ్యక్తం చేసింది. ఉద్యోగుల భద్రతలో భాగంగా ఆశా వర్కర్లకు వేతనాల పెంపు, 50వేల ఆర్టీసి కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటం తో పాటు అంగన్‌వాడీ,హోం గార్డులకు వేతనాల పెంపు, అదనంగా 1.4లక్షల ఉద్యోగాల భర్తీ, ఆప్కాస్ ఏర్పాటుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెసులు బాటు కల్పించిన అంశాలు మంత్రి వర్గంలో ప్రస్తావనకు వచ్చాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this