Monday, October 13, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
EntertainmentSquid Game Season 2 : స్క్విడ్...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

Squid Game Season 2 : స్క్విడ్ గేమ్ సీజన్ 2 పై బిగ్ అప్డేట్! స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Squid Game Season 2 –  2021లో వచ్చిన ఈ కొరియన్ వెబ్ సిరీస్ ప్రపంచం మెుత్తాన్ని ఉర్రూతలూగించింది. మూడేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ ల్లో టాప్ లో నిలిచింది. ఇక సీజన్ 1 సాధించిన భారీ విజయంతో.. సీజన్ 2 శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుందంటే?

Squid Game Season 2

‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మేకర్స్ వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ.. సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. హ్వాంగ్ డాంగ్ హ్యూక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందుకు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తొలి సీజన్ లాగే తెలుగు డబ్బింగ్ కూడా ఉండనుంది. దీంతో పాటుగా వచ్చే సంవత్సరం అంటే 2025లో సీజన్ 3 తీసుకొస్తామని, అలాగే ఈ సిరీస్ కు ముగింపు పలుకుతామని తెలిపింది.

Squid Game Season 2 కాగా.. స్క్విడ్ గేమ్ సీజన్ 1ను 9 ఎపిసోడ్స్ తో తీశారు. 2021లో వచ్చిన ఈ సిరీస్ మూవీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. క్షణక్షణం ఉత్కంఠ రేపే సీన్స్ తో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఉర్రూతలుగించింది. అప్పట్లో మోస్ట్ పాపులర్ సిరీస్ గా నిలిచింది. చిన్న చిన్న గేముల్లో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కంటెస్టెంట్స్ చేసే పోరాటాలు ఇందులో ఆకట్టుకుంటాయి. ఇక ఇప్పుడు సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ కావడంతో.. అభిమానులు సంబరపడిపోతున్నారు. మరి మీలో ఎంత మంది స్క్విడ్ గేమ్ సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this