India Corona: మళ్లీ 2 వేలకు పైగా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

India Corona: మళ్లీ 2 వేలకు పైగా కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న దిల్లీ, ముంబయి..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబయిలో ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం..

India Corona: మళ్లీ 2 వేలకు పైగా కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న దిల్లీ, ముంబయి..! 

మంగళవారం 4.21 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,067 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దిల్లీ(632), కేరళ(488) ప్రభావమే మొత్తం కొత్త కేసులపై ఎక్కువగా కనిపిస్తోంది. ముంబయిలో మార్చి 2 తర్వాత అత్యధిక కేసులు(85) నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, మహారాష్ట్ర, మిజోరం వంటి రాష్ట్రాలు కొవిడ్ కట్టడి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మంగళవారం కేంద్రం సూచించింది. అలాగే గణాంకాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని కేరళ ప్రభుత్వానికి వెల్లడించింది.  

క్రితంరోజు ఒకేఒక్క కరోనా మరణం నమోదుకాగా.. నిన్న 40 మంది మరణించారు. కేరళ ప్రకటించిన మృతుల సంఖ్యే 34గా ఉంది. ఇప్పటివరకూ 5.22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

ప్రస్తుతం రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా వస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,547 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు 12,340కి పెరిగాయి. మొత్తం కేసుల్లో రికవరీల వాటా 98.76 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు 0.03 శాతంగా కొనసాగుతోంది.

ఇక నిన్న 17,23,733 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకూ 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

india corona: మళ్లీ 2 వేలకు పైగా కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న దిల్లీ, ముంబయి..!

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this